Telangana Election Results 2023: దేశంలో ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో మిజోరాం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల కౌంటింగ్ రేపు జరగనుంది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ కోసం తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా వ్యవస్థ ఇలా ఉన్నాయి.
TS Assembly Elections 2023 Voting Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది తొలుత మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3.26 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
Schools Closed: తెలంగాణ ఎన్నికలకు మరి కొద్దిగంటలే మిగిలాయి. ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని అన్ని విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవులు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Election 2023: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చివరి ఎన్నికలు మిగిలాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. చివరిరోజు కావడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని పీక్స్‌కు తీసుకెళ్లనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? అధికారంలోకి ఎవరు వస్తారు..? అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా జీ న్యూస్-మ్యాట్రిజ్ నిర్వహించిన ఓపియన్ పోల్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాలు ఇలా..
Kollapur Assembly Constituency: గత ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్‌లోని కొల్లాపూర్ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. గెలిచిన ఎమ్మెల్యే కూడా అధికార పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు పార్టీలు మారడంతోపాటు బీజేపీ బలం పుంజుకోవడంతో పోరు ఉత్కంఠభరితంగా ఉండనుంది.
Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశంతో పోటీకి దూరంగా ఉంటామని తెలిపారు.
Telangana Assembly Election 2023 Notification: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ షూరు అయింది. ఈ నెల 10వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు వేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Nomination Filing Rules For Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. 119 స్థానాలకు నేటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 10వ తేదీలోపు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే..
Shad Nagar Assembly Constituency: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల నేతలు తమదైన రీతిలో ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. అధికార బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం రంగంలో దూసుకుపోతున్నాయి. షాద్ నగర్ అసెంబ్లీలో బలబలాలు ఎలా ఉన్నాయి..? ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి..? ఓసారి లుక్కేద్దాం..
Harish Rao Public Meeting in Station Ghanpur: కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని.. రిజెక్టెడ్ నాయకులను చేర్చుకుంటున్నారని అన్నారు హరీష్ రావు. సీఎం కేసీఆర్ చెప్పింది చేశారని.. చెప్పనిది కూడా చేశారని అన్నారు. బీఆర్ఎస్ హామీలను ఈ సందర్భంగా వివరించారు.
BRS Manifesto Highlights: తెలంగాణ ఎన్నికలకు గులాబీ బాస్ కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటించారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించారు. పేద ప్రజలపై వరాలు జల్లు కురిపించారు. మేనిఫెస్టో హైలెట్స్ ఇవే..
Telangana Assembly Election 2023: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ రానుంది.
Ponguleti Srinivas Reddy About Land Kabja Allegations: తనకు ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్టపడి పనిచేస్తాను అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.