Harish Rao Public Meeting in Station Ghanpur: మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అంటూ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శనివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అందరికీ మంచి ప్రాధాన్యం ఉంటుందని.. కార్యకర్తలు బేధాభిప్రాయాలు లేకుండా పని చేయాలని సూచించారు. ఉమ్మడి వరంగల్‌లో అత్యధిక ఓట్లు రావాలని అన్నారు. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చాక.. పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రూ.50 కోట్ల డబ్బులు పెట్టి పీసీసీ పదవి కొన్నారని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారని.. అది తప్పు అయితే రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలన్నారు.
"5 కోట్లకు టికెట్ అమ్ముకున్నారని అంటున్నారు. ఇలాంటి వాళ్ళ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అభ్యర్థులు దొరకడం లేదు. రిజెక్ట్ చేసిన వాళ్లని చేర్చుకుంటారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలలో పోటీ చేస్తారట. మీ నియోజకవర్గాల్లో పోటీ చేసే దిక్కు మీకు లేదు. మోసానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ.. నాటకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. 2009 ఎన్నికల్లో చెప్పినవి అమలు చేయలేదు. కాంగ్రెస్ 2009 మేనిఫెస్టోలో కరెంట్, తండాలు గుడెలు, 6 కిలోల బియ్యం అన్నారు. కేసీఆర్ చావు నోట్లో తల పెట్టీ తెలంగాణ సాధించారు. చెప్పింది చేశారు.. చెప్పనిది కూడా చేశారు.
కేసీఆర్ భరోసా పేరిట మన మేనిఫెస్టో ఉంది. ప్రతి గడప గడపకు తీసుకువెళ్ళాలి. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్.. రైతుకే డబ్బు ఇచ్చిన ఒకే ఒక్కడు కేసీఆర్. ఎకరాకు 10 వేలు ఇచ్చాడు.. 16 వేలకు పెంచబోతున్నాం. పింఛన్లు రూ.5 వేలకు పెంచబోతున్నాం. రూ.400 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు 3 వేలు ఇవ్వబోతున్నాము. రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. ఏటా 1300 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా సీఎం గారు లెక్క చేయడం లేదు. గురుకులాల్లో ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్నం. ఇక నుంచి పెద్దలకు కూడా సన్నబియ్యం ఇస్తాం.." అని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
రైతు బీమా లాగానే.. 5 లక్షల బీమా కోటి కుటుంబాలకు చేయబోతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ గెలిచాక ఆసరా పింఛన్లు రూ.5 వేలు చేయబోతున్నామని.. అసైన్డ్ ల్యాండ్స్‌కు పూర్తి హక్కులు ఇవ్వ బోతున్నామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 15 లక్షల చికిత్స ఉచితంగా అందిస్తామన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నిండుకుండలాగా మార్చింది సీఎం కేసీఆర్ అని అన్నారు. కడియం శ్రీహరి మంచి నాయకులు అని.. రాజన్న, శ్రీహరి కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు. మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వం బంపర్ బహుమతి.. 7వ వేతన సంఘం అమలుపై కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook