Schools Closed: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30 గురువారం జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి అంటే నవంబర్ 29, 30 తేదీల్లో సెలవు ప్రకటించారు. డిసెంబర్ 1న తిరిగి విద్యాసంస్థలు తెర్చుకోనున్నాయి.
తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరి కొద్దిగంటల్లో అంటే నవంబర్ 30 ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వం ముగియనుండటంతో ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే దేశంలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్ , ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. నవంబర్ 30 తెలంగాణ పోలింగ్ కూడా పూర్తయ్యాక డిసెంబర్ 3వ తేదీన మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. గ్రైటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు రెండ్రోజులపాటు అంటే రేపు, ఎల్లుండి సెలవు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు.
అంటే నవంబర్ 29, 30 తేదీల్లో గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడనున్నాయి. తిరిగి డిసెంబర్ 1 శుక్రవారం అన్ని స్కూల్స్, కళాశాలలు తెర్చుకోనున్నాయి. అదే విధంగా ఇతర జిల్లాల్లో కూడా విద్యా సంస్థలు మూతపడనున్నాయి.
Also read: Cyclone Michaung Alert: ఏపీకు సూపర్ సైక్లోన్ ముప్పు, డిసెంబర్ 1 నుంచి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook