Telangana: తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేత ప్రారంభం

ఓ చరిత్ర ముగుస్తోంది. తెలంగాణ ( Telangana) గడ్డపై నిజాం ( Nizams) నవాబుల కట్టడం నేలకొరిగింది. శతాబ్దానికి పైగా పాలనలో సేవలందించించిన ఆ భవన   సముదాయం ఇకపై కన్పించదు. కొత్త రాష్ట్రానికి కొత్త సచివాలయం ( New Secretariat ) నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. న్యాయపరమైన అడ్డంకుల్ని అధిగమించి..కూల్చివేతను ప్రారంభించింది.

Last Updated : Jul 7, 2020, 11:47 AM IST
Telangana: తెలంగాణలో పాత సచివాలయం  కూల్చివేత ప్రారంభం

ఓ చరిత్ర ముగుస్తోంది. తెలంగాణ ( Telangana) గడ్డపై నిజాం ( Nizams) నవాబుల కట్టడం నేలకొరిగింది. శతాబ్దానికి పైగా పాలనలో సేవలందించించిన ఆ భవన   సముదాయం ఇకపై కన్పించదు. కొత్త రాష్ట్రానికి కొత్త సచివాలయం ( New Secretariat ) నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. న్యాయపరమైన అడ్డంకుల్ని అధిగమించి..కూల్చివేతను ప్రారంభించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  సెక్రటేరియట్ ( United Andhra pradesh Secretariat ) గా భాసిల్లిన ఆ విశాల భవన సమూదాయం ఇకపై కన్పించదు. ఇవాళ్టి వరకూ వాస్తవంగా ఉన్న ఆ భవనాలు రేపట్నించి ఓ చరిత్రగా మారనున్నాయి. ఒకటి కాదు రెండు కాదు 132 ఏళ్ల చరిత్ర ఇకపై ముగుస్తోంది. 1888లో నిజాం నవాబులు సైఫాబాద్ ప్యాలెస్( Saifabad palace) పేరుతో ఈ భవనాల్ని నిర్మించారు. 10 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో పది బ్లాకుల్లో ఉన్న ఈ భవన సముదాయంలో అనేక మంది ముఖ్యమంత్రులు పాలన అందించారు. ఈ భవన సముదాయంలో అతి పురాతనమైన జీ బ్లాకు ఆరవ నిజాం ( 6th Nizam period ) కాలంలో నిర్మితమైంది. 2003లో డీ బ్లాకు, 2012లో నార్త్, సౌత్ బ్లాకుల్ని అప్పటి ప్రభుత్వాలు నిర్మించాయి. ఇదంతా ఇకపై చరిత్ర. Also read: కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలం

ఇప్పుడు సరికొత్త భవనాన్ని మరో ప్రాంతంలో నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) సిద్ధమైంది. దాదాపు 5 వందల కోట్ల రూపాయలతో కొత్త సెక్రటేరియట్ ( New Secretariat ) ను ఆధునిక హుంగులతో నిర్మించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించదల్చిన కొత్త సచివాలయంలో అధునాతన హిల్స్ ఏర్పాటు కానున్నాయి. మంత్రుల పేషీలోనే వివిధ శాఖల కార్యదర్శులు, సెక్షన్ కార్యాలయాలు రానున్నాయి. Also read: Ap Model Schools: మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్లు ప్రారంభం

పాత సచివాలయం కూల్చివేతలో ఎదురైన న్యాయపరమైన అడ్డంకుల్ని అధగమించిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కూల్చివేత పనుల్ని ప్రారంభించింది. దీనికోసం ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, మింట్ కాంపౌండ్, సెక్రటేరియట్ దారుల్ని మూసివేసి..భారీగా పోలీసుల్ని మొహరించారు. రాత్రిలోగా కూల్చివేత పనుల్ని ముగించేలా పనులు సాగుతున్నాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   

Trending News