Lockdown 4.0 : తెలంగాణ లాక్‌డౌన్‌ 4.0 లో అనుమతి లేనివి

తెలంగాణలో మే 31 వరకు లాక్‌‌డౌన్‌ అమలులో ఉంటుందని ప్రకటించిన సీఎం కేసీఆర్.. కంటైన్మెంట్ జోన్, గ్రీన్ జోన్ అని జోన్లతో సంబంధం లేకుండా కొన్ని రకాల సేవలు, వ్యాపారాలకు మాత్రం అనుమతులు ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం సర్కార్ తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు.

Last Updated : May 18, 2020, 11:05 PM IST
Lockdown 4.0 : తెలంగాణ లాక్‌డౌన్‌ 4.0 లో అనుమతి లేనివి

హైదరాబాద్‌: తెలంగాణలో మే 31 వరకు లాక్‌‌డౌన్‌ అమలులో ఉంటుందని ప్రకటించిన సీఎం కేసీఆర్.. కంటైన్మెంట్ జోన్, గ్రీన్ జోన్ అని జోన్లతో సంబంధం లేకుండా కొన్ని రకాల సేవలు, వ్యాపారాలకు మాత్రం అనుమతులు ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం సర్కార్ తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు. 

సీఎం కేసీఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు, క్రీడామైదానాలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్‌ హాల్స్‌కు అనుమతి లేదు. అలాగే బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్, క్లబ్స్, జిమ్స్‌కి సైతం అనుమతి లేదు. హైదరాబాద్ మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండవు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున హైదరాబాద్ నగరంలో పరిధిలో సబర్బన్ బస్సులను అనుమతించడం లేదు. అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మూసివేసే ఉంటాయని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కరోనావైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు తీసుకునే నివారణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం పేర్కొన్నారు.

Trending News