COVID-19 Updates : తెలంగాణలో కరోనాతో మరో ఇద్దరు మృతి

తెలంగాణలో నేడు కొత్తగా 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus positive cases ) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో 15 కేసులు జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో నమోదు కాగా మరో 12 మంది వలసకూలీలు ( Migrant workers ) ఉన్నారు.

Last Updated : May 20, 2020, 11:00 PM IST
COVID-19 Updates : తెలంగాణలో కరోనాతో మరో ఇద్దరు మృతి

హైదరాబాద్: తెలంగాణలో నేడు కొత్తగా 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus positive cases ) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో 15 కేసులు జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో నమోదు కాగా మరో 12 మంది వలసకూలీలు ( Migrant workers ) ఉన్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1661 కి చేరింది. వీరిలో 89 మంది వలసకూలీలు ఉన్నారు. 

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో (COVID-19 Health bulletin) పేర్కొన్న వివరాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 1,013 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 608 యాక్టివ్ కేసులున్నాయి. బుధవారం కరోనావైరస్‌తో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 40కి చేరింది. 

వరంగల్‌ రూరల్‌, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ( Warangal rural, Yadadri-bhongir, Wanaparthi districts ) ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. అయితే, ఈ జిల్లాల నుంచి పలువురు వలసకూలీలకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. ప్రభుత్వం వారిని వలసకూలీల కిందే గుర్తించడంతో వారి కేసులను ఈ జిల్లాల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. ఇదిలావుంటే, మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులన్నీ దాదాపు జీహెచ్ఎంసీ పరిధిలోవే కావడంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలన్నీ గ్రీన్ జోన్లుగానే ( Green zones ) ఉన్నాయని సమాచారం.

Trending News