రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు (President Ram Nath Kovind Birthday) నేడు (అక్టోబర్ 1). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి కోవింద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పార్లమెంటులో ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లును వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ భాగస్వామ్య శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) రాజీనామా చేశారు. సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆమె గురువారం రాత్రి రాజీనామా చేశారు.
ప్రపంచం నలుమూలల నుంచి ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) కీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుతో (సెప్టెంబరు 17) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రముఖులు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ సారి సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు.. సభ్యులకు పలు షరతులు కూడా విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఉభయసభల అధికారులు.
మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీకి 10 రాజాజీమార్గ్‌లోని తన అధికారిక నివాసంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ముందుగా రక్షణ అధికారులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంజలి ఘటించారు.
భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ( Ram Nath Kovind ) మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంతో పూర్తి చేసుకున్నారు. రామ్‌నాథ్ కోవింద్ భారత 14వ రాష్ట్రపతిగా 2017 జూలై 25న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు.. ఎంతోమందితో భేటి అయిన రాష్ట్రపతిగా నిలిచారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తానని చెప్పారు.
ఎన్నో దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అవతరణ దినోత్సవం (Telangana Formation Day) నేడు (జూన్ 2). ఈ సందర్బాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
mercy plea of Nirbhaya convict Vinay Kumar Sharma నిర్భయ దోషుల ఉరితీతకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రతి రామ్ నాథ్ కోవింద్ శనివారం నిర్భయ దోషి వినయ్ వర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేశారు. దీంతో నలుగురు దోషులకు శిక్ష మరో రెండు వారాల్లో అమలు కానుంది.
71వ గణతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశప్రజలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సోదరభావాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. మహాత్మా గాంధీ బోధనలు, విలువలు, దైనందిన జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు.
నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులకు క్షమాభిక్ష పెట్టాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరడం వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దోషులను సోనియా గాంధీ క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి నలుగురు దోషులను క్షమించాలని సీనియర్ న్యాయవాది కోరారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నిర్భయ కేసులో దోషులకు జనవరి 22న మరణశిక్ష అమలు చేయడం లేదు. తాజా డెత్ వారెంట్ ప్రకారం ఉరిశిక్ష అమలు ఫిబ్రవరి 1కి వాయిదా పడింది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్ద తిరస్కరించారు. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పంపించింది.
నిర్భయ కేసు దోషులలో ఒకరైన ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు చేరింది. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది.
నిర్భయ కేసు దోషులకు విధించిన డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ పాటియాలా హైకోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌లో ఎలాంటి తప్పిదం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
నిర్భయ అత్యాచారం, హత్య దోషుల మరణ శిక్ష అమలు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారెంట్ ప్రకారం దోషులు నలుగురిని జనవరి 22న కచ్చితంగా ఉరితీయడం కుదరదని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు తెలిపింది.
ఢిల్లీలో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురికి ఢిల్లీ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే . నలుగురు దోషులలో ఒకరైన ముఖేష్ సింగ్ మంగళవారం రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినట్లు తిహార్ జైలు అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.