Mukesh Singh Mercy Petition: నిర్భయ దోషుల ఉరిపై ట్విస్ట్.. ఆరోజు కుదరదన్న ప్రభుత్వం

నిర్భయ అత్యాచారం, హత్య దోషుల మరణ శిక్ష అమలు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారెంట్ ప్రకారం దోషులు నలుగురిని జనవరి 22న కచ్చితంగా ఉరితీయడం కుదరదని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు తెలిపింది.

Last Updated : Jan 15, 2020, 04:21 PM IST
Mukesh Singh Mercy Petition: నిర్భయ దోషుల ఉరిపై ట్విస్ట్.. ఆరోజు కుదరదన్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య దోషుల మరణ శిక్ష అమలు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారెంట్ ప్రకారం దోషులు ముకేశ్, పవన్ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్, వినయ్ శర్మలకు జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాలి. అయితే నిర్ణీత తేదీన దోషులు నలుగురిని కచ్చితంగా ఉరితీయడం కుదరదని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు తెలిపింది. దోషులలో ఒకరైన ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ ప్రస్తుతానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్ద పెండింగ్‌లో ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

Also Read: ఈ 22న నిర్భయ దోషులకు ఉరి. ఎవరీ పవన్ జల్లాద్?

తనకు విధించిన మరణశిక్ష నుంచి మినహాయింపు ఇచ్చి, శిక్షను జీవితఖైదుగా మార్చాలని ముకేశ్ ఇదివరకే రాష్ట్రపతి కోవింద్‌కు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించిన అనంతరం ఢిల్లీ ప్రభుత్వానికి చేరుతుంది. చివరగా రాష్ట్రపతి వద్దకు పిటిషన్ వెళుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం వద్దకు ముకేవ్ క్షమాభిక్ష పిటిషన్ రాగా.. జనవరి 22న శిక్షఖరారురు నిర్ణయించే సమయంలో నిర్భయ దోషులను ఉరితీయలేమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

 

Also Read: రాష్ట్రపతిని క్షమాబిక్ష కోరిన నిర్భయ నిందితుడు ముఖేష్ సింగ్

ముకేశ్ క్షమాభిక్ష ఇంకా పెండింగ్‌లోనే ఉందని, రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించిన పక్షంలోనూ.. 14రోజుల తర్వాత ఉరిశిక్ష అమలు చేయాల్సి వస్తుందని తిహార్ జైలు తరఫు అడ్వకేట్ రాహుల్ మెహ్రా వివరించారు. కాగా, పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ తర్వాత నిర్భయ దోషులు వినయ్ శర్మ, ముకేశ్ సింగ్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అనంతరం చివరి ప్రయత్నంగా ముకేష్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి కోవింద్‌కు దాఖలు చేసుకున్న పిటిషన్ పెండింగ్‌లో ఉంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News