Narendra Modi Birthday: ప్ర‌ధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ

 ప్రపంచం నలుమూలల నుంచి ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) కీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుతో (సెప్టెంబరు 17) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రముఖులు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Last Updated : Sep 17, 2020, 11:50 AM IST
Narendra Modi Birthday: ప్ర‌ధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ

Happy Birthday PM Narendra Modi: ఢిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) కీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుతో (సెప్టెంబరు 17) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రముఖులు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయనకు రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind), ఉప‌రాష్ర్ట‌ప‌తి వెంకయ్య‌నాయుడు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. భార‌త‌దేశ జీవ‌న విలువ‌లు పాటిస్తూ, ప్ర‌జాస్వామ్య సాంప్ర‌దాయ ఆద‌ర్శాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లారని వారివురు ప్రధానిని కొనియాడారు. భ‌గ‌వంతుడు మిమ్మ‌ల్ని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాల‌ని ప్రార్థిస్తూ.. మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.  Also read: Covid-19: దేశంలో 40లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య

ఇదిలాఉంటే.. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బీజేపీ సేవా సప్తహ్ పేరుతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అన్నీ రాష్ట్రాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. Also read; Arjun Tendulkar: ముంబై ఇండియన్స్ జట్టులోకి సచిన్ తనయుడు

ఇదిలాఉంటే.. మోదీకి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతోపాటు.. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్‌, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కూడా మోదీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ట్విటర్‌ ద్వారా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. IPL 2020: జట్టుతో చేరిన అరుదైన క్రికెటర్

Trending News