President Ram Nath: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల నాలుగో వారంలో హైదరాబాద్‌కు రానున్నారు. శీతాకాల విడిదిలో (President`s winter sojourn) భాగంగా ఐదు రోజులు హైదరాబాద్‌లో సతీ సమేతంగా బస చేయనున్నారు.
రాష్ట్రపతి రాక నేపథ్యంలో.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆక్టోపస్ టీమ్ ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది.
ఇదే చివరి విడిది?
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు హైదరాబాద్ శీతాకాల విడిది ఇదే చివరిది కానుంది. ఎందుకంటే వచ్చే ఏడాది జులైలో రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి (President Ram Nath to Hyderabd) రాకకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రపతి ప్రతి ఏటా శీతాకాలంలో హైదరాబాద్‌లోని రాష్ట్రపతి భవన్లో బస చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఈ నెలలో హైదరాబాద్‌కు రానున్నారు. అయితే కొవిడ్ కారణంగా గత ఏడాది రాష్ట్రపతి హైదాబాద్‌కు రాలేదు. రాష్ట్రపతి రాక తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలన్నీ భద్రతా దళాల నిఘాలో ఉంటాయి.
రాష్ట్రపతి రాక ఇలా..
ప్రత్యేక విమానంలో ఢీల్లీ నుంచి బయల్దేరీ హైదరాబాద్ డిండిగల్ విమాానాశ్రయానికి రానున్నారు రామ్‌నాథ్ కోవింద్. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బొల్లారం చేరుకోనున్నారు. 4-5 రోజుల పాటు అక్కడే బస చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది.
Also read: Driving license to dwarf: హైదరాబాద్ మరగుజ్జుకు డ్రైవింగ్ లైసెన్స్- దేశంలోనే తొలిసారి!
Also read: Shilpa Chowdary : శిల్ప చౌదరి కేసులో కొత్త కోణం, రాధికకు డబ్బులు ఇవ్వడంతోనే మోసపోయిందట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook