TDP MPs: రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీకి టీడీపీ ఎంపీలు

TDP MPs: అమరావతి : టీడీపీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు టీడీపీ ఎంపీలకు అపాయింట్‌మెంట్ లభించింది. గత 13 నెలలుగా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎంపీలు రాష్ట్రపతికి  నివేదించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Last Updated : Jul 15, 2020, 11:20 PM IST
TDP MPs: రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీకి టీడీపీ ఎంపీలు

TDP MPs: అమరావతి : టీడీపీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు టీడీపీ ఎంపీలకు అపాయింట్‌మెంట్ లభించింది. గత 13 నెలలుగా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎంపీలు రాష్ట్రపతికి  నివేదించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమిక హక్కులు కాలరాయడం, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని టీడీపీ ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

Also read: COVID-19 vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఏయే దేశాలు ముందున్నాయి.. సమగ్ర కథనం 

ఏపీలో వైసీపీ సర్కార్ ( AP govt ) అండదండలు చూసుకుని ఆ పార్టీ నాయకులు హింస, విధ్వంసాలకు పాల్పడుతుండటంతో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దౌర్జన్యాలకు దిగుతున్నారని రాష్ట్రపతి దృష్టికి తీసుకురానున్నట్టు టీడీపీ నేతలు ( TDP leaders ) తెలిపారు. టీడీపీపైనే కాకుండా ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపైనా ఓవైపు వైసిపి నేతలు దాడులకు పాల్పడుతుండగా.. మరోవైపు వైసిపి సర్కార్ తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలన్నింటి గురించి సాక్ష్యాధారాలతో సహా రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లేందుకు టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ( Also read: Jio Glass price: జియో గ్లాస్ ధర ఎంత ? జియో గ్లాస్ ఫీచర్స్ ఏంటి ? )

Trending News