Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆయన పై పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేస్తూ గుంటూరు జిల్లాలోని ప్రత్యేక న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. దీంతో జనసేనికులతో పాటు పవన్ కళ్యాణ్ ను అభిమానించే ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Pawan Kalyan Mahastra Elections: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ పెద్దల మనసు దోచుకున్నాడు పవన్ కళ్యాణ్. తాజాగా నరేంద్ర మోడీ, అమిత్ షాలు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ కు అక్కడి కీలకమైన ప్రచార బాధ్యతలు అప్పగించారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించనుందా.. ? అందుకే జనసేనాని హస్తిన పర్యటనకు వెళ్లారా. అంతేకాదు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వంలో హోం మినిస్టర్ పై పవన్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణమైతే..హఠాత్తుగా ఢిల్లీ పర్యటన మరో కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
అమరుల త్యాగాలను గుర్తించాలని, వారి కుటుంబాలకు అండగా నిలవాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సైనిక్ బోర్డుకు కోటి రూపాయల విరాళం అందించారు.
ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో క్రమక్రమంగా పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుండగా మరోవైపు సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ.. బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో నేడు బీజేపి, జనసేన పార్టీల మధ్య ఓ కీలక సమావేశం జరిగింది.
ఏపీ రాజకీయాల్లో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డాను కలిసిన అనంతరం ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయా అనే ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల ప్రజల్లో తలెత్తిన అనుమానాలు, మూడు రాజధానుల నిర్ణయాలను జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ సవివరంగా చర్చించినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.