Nobel prize in Physics 2022: భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. క్వాంటమ్ మెకానిక్స్ లో విశేష కృషి చేసిన అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జైలింగర్‌లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు (Nobel prize in Physics 2022) లభించింది.
ఫోటాన్‌లలో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో కృషికిగానూ ఈ ముగ్గురికి నోబెల్ ప్రకటించినట్లు అకాడమీ తెలిపింది. 2021లో కూడా భౌతిక నోబెల్ ముగ్గురును వరించింది. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై చేసిన పరిశోధనలకు గానూ సుకురో మనాబే, క్లాస్ హాసిల్‌మన్, జార్జియో పారిసీలు సంయుక్తంగా ఈ పురస్కారం అందుకున్నారు.
BREAKING NEWS:
The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Physics to Alain Aspect, John F. Clauser and Anton Zeilinger. pic.twitter.com/RI4CJv6JhZ— The Nobel Prize (@NobelPrize) October 4, 2022
ఇప్పటికే వైద్య, భౌతికశాస్త్రాలలో నోబెల్ అవార్డులు ప్రకటించగా.. . బుధవారం రసాయన, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి విజేతల పేర్లను వెల్లడిస్తారు. అయితే ఆర్థిక రంగానికి సంబంధించిన నోబెల్ విన్నర్ ను మాత్రం అక్టోబరు 10న ప్రకటించనున్నారు. నోబెల్ విజేతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు ఇవ్వనున్నారు. ఈ ప్రైజ్ మనీని డిసెంబరు 10న అందజేస్తారు. స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరుమీద ఈ అవార్డులను 1901 నుంచి ఇస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook