ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై విమర్శల ధాటి పెరుగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయాలున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
ఏపీలో వార్ ప్రారంభమైపోయింది. ప్రభుత్వంతో పేచీకి దిగడం మానడం లేదు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్ ఉత్తర్వులతో సై అంటే సై అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల పంచాయితీ మళ్లీ కోర్టుకెక్కింది. ఎన్నికల కమీషనర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ..ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.
AP Local Body Elections 2021: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా వైరస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 2021లో ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనని రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
AP SEC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వివాదాస్పదమయ్యారు. హైదరాబాద్ లో నివాసముంటున్న ఇంటి వ్యవహారమై పంచాయితీ ఇప్పుడు గవర్నర్ వద్దకు చేరింది. ఈ సమస్య నుంచి నిమ్మగడ్డ ఎలా బయటపడతారో చూడాలి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రధాన ఎన్నికల కమీషనర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై అధికారపార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నిస్తోంది.
ఏపీలో మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ వైఎస్ జగన్ రగడ ప్రారంభమయ్యేలా ఉంది. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి అధికారపార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇప్పుడిదే కొత్త వివాదానికి దారి తీస్తోంది.
ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar As AP SEC) నేడు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar)ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నియమించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
Nimmagadda meeting with BJP leaders: అమరావతి: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kumar ) మరోసారి వివాదాస్పదమయ్యారు. బీజేపీ నేతలు రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ అయిన వీడియో వెలుగులోకి రావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది... అసలేం జరిగింది.
Nimmagadda Ramesh Kumar అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును రద్దు చేస్తూ గత వారం ఏపీ హై కోర్టు (AP high court ) ఇచ్చిన సంచలన తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల క్రితం జూన్ 1న సుప్రీం కోర్టులో ఈ వివాదంపై ఏపీ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ ( SLP petition ) దాఖలు చేయగా.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ శుక్రవారం స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించిన డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) విషయంలో నిమ్మగడ్డ లాజిక్ మిస్ అయినట్టే కన్పిస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ ( AP AG Subrahmanya Sriram ) స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రమాణ స్వీకారం చేసి రేపటితో ఏడాది పూర్తవుతోంది. 3 వేల 648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో అనుకున్న లక్ష్యాన్ని అఖండ మెజార్టీతో సాధించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించిన జననేతగా పేరు తెచ్చుకున్న జగన్ 2019 మే 31న రాష్ట్ర ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని ( Nimmagadda Ramesh Kumar ) తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High court ) ఇచ్చిన తీర్పు రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఏపీ సర్కార్‌కి ఇదో పెద్ద దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు సైతం ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే అంశంపై బీజేపీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు ( BJP MP GVL Narasimha Rao ) స్పందించారు.
ఏపీ హై కోర్టు ( AP High court ) రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని ( AP SEC Nimmagadda Ramesh Kumar ) ఆ స్థానం నుంచి తొలగించడంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయన్ని తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగింపు వ్యవహారం అనేది ఒక విధానపరమైన నిర్ణయమని.. దానిని రాద్దాంతం చేసి రాజకీయం చేయడం తగదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఏపీ సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని అంబటి విస్మయం వ్యక్తంచేశారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఐదేళ్లుగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఓ ఆర్డినెన్సుని తీసుకురాగా.. ఆ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నుంచి ఆమోదం సైతం లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.