హైదరాబాద్ : ఏపీ హై కోర్టు ( AP High court ) రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని ( AP SEC Nimmagadda Ramesh Kumar ) ఆ స్థానం నుంచి తొలగించడంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయన్ని తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 200లో ( Section 200 in Panchayati raj act ) తీసుకొచ్చిన సవరణల ఆమోదిస్తూ ఏపీ సర్కార్ ( AP govt ) జారీ చేసిన ఆర్డినెన్సుని సైతం హై కోర్టు కొట్టేసింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌ని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్టుగా అప్పట్లో ఏపీ సర్కార్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఆర్టికల్ 213 ప్రకారం ఏపీ సర్కార్‌కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం లేనందున ఆ ఆర్డినెన్స్‌ని రద్దు చేస్తున్నట్టుగా చెప్పిన హై కోర్టు.. ఆ ఆర్డినెన్స్ చెల్లనందున రమేష్ కుమార్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జికె మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. ( Read also : Nimmagadda Ramesh Kumar: నిమ్మగడ్డ విషయంలో చంద్రబాబు బాధంతా అదే: అంబటి )
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) తొలగింపు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హై కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ( Kamineni Srinivas ) హై కోర్టు తీర్పును స్వాగతించారు. హై కోర్టు తీర్పుపై ఆయన స్పందిస్తూ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని ఆ స్థానం నుంచి తొలగించి.. కనగరాజును ( Kanaga Raju ) నియమించిన తీరు చూస్తే... ఏపీ సర్కార్ రాజ్యంగ ఉల్లంఘనకు ( Constitutional violation ) పాల్పడినట్టు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ఇకనైనా ఏపీ సర్కార్ హై కోర్టు తీర్పును అమలు చేయకపోతే... అది రాష్ట్ర ప్రభుత్వానికే నష్టమని కామినేని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ( Read also : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు )
హై కోర్టు తీర్పు అనంతరం న్యాయవాది జంద్యాల రవి శంకర్ ( Advocate Jandhyala Ravi Shankar ) మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పు ప్రకారం ఈ క్షణం నుంచే రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌గా కొనసాగుతారని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..