Komatireddy Rajagopal Reddy Gets EC Notice: మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేస్తోన్న బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ షాక్ ఇచ్చింది. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఓటర్లను ప్రలోభపెట్టడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 5 కోట్లకుపైగా మొత్తాన్ని సొంత కంపెనీ ఖాతా నుంచి నిధులు మళ్లించారని టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై ఈసి స్పందించింది.
JP Naddas grave built in Telangana : మునుగోడులో జేపీ నడ్డాకు సమాధి నిర్మించారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి నిర్మించిన వైనం సంచలనం రేపింది.
Minister Malla Reddy Liquor Party: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లా రెడ్డి.. ఒక ఇంచార్జుగా తనకు అప్పగించిన గ్రామాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు స్వయంగా తానే మందు పార్టీ ఇస్తుండగా తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Munugode bypolls Important Dates: మునుగోడు ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ షురూ కానుంది. ఈ నెల 14వ తేదీ వరకు మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే 15వ తేదీన నామినేషన్ల పరిశీలన, 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా 6వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Revanth Reddy Speech in Munugode Bypoll Campaign: మునుగోడు ఉప ఎన్నికల ర్యాలీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తాను టీడీపీలో ఉండి ఉండొచ్చు.. కానీ ఇప్పుడు నేను టీపీసీసీ చీఫ్ హోదాలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తినని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మునుగోడు పైనే ఫోకస్ చేశాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మునుగోడు బైపోల్ టార్గెట్గా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.