Munugode bypolls Important Dates: మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్లపై లేటెస్ట్ అప్‌డేట్స్

Munugode bypolls Important Dates: మునుగోడు ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ షురూ కానుంది. ఈ నెల 14వ తేదీ వరకు మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే 15వ తేదీన నామినేషన్ల పరిశీలన, 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా 6వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.

  • Zee Media Bureau
  • Oct 8, 2022, 06:02 AM IST

Munugode bypolls Important Dates: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి చండూరు తహశీల్దార్ కార్యాలయంలో ప్రతీ రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారు. మునుగోడు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి చండూరులోనే నామినేషన్లు స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్నందున ఈసారి కూడా అక్కడే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 

Video ThumbnailPlay icon

Trending News