KA Paul on munugode Bypolls: పాత్రికేయులకు, పోలీసు అధికారులకు, పోలింగ్ బూత్ లలో సేవలు అందించిన సిబ్బందికి హృదయపూర్వక వందనాలు అంటూ వీడియో ప్రారంభించిన కేఏ పాల్.. మునుగోడు ఓటింగ్ సరళిపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 52 వేల మంది నిరుద్యోగులు, 53 వేల మంది యువత కలిపి మొత్తం లక్షా 5 వేల మంది ఓటర్లు బయటికొచ్చి ఓటు వేశారని.. కనీసం 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని కె.ఎ. పాల్ అన్నారు.
బీజేపీ 30 వేలు ఇస్తానని చెప్పి 3 వేలే ఇచ్చిందని, టీఆర్ఎస్ పార్టీ 30 వేలు ప్లస్ తులం బంగారం ఇస్తామని చెప్పి 3 వేలే ఇచ్చి మోసం చేశాయని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎలాగూ తమకు డిపాజిట్ కూడా దక్కదనే భయంతో 500 నుంచి వెయ్యి రూపాయలే ఇచ్చి ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారని తెలిపారు. అయినప్పటికీ ప్రజా శాంతి పార్టీ మద్దతుదారులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. తమకు మంచి రోజులు వచ్చాయని మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుపై ఆశాభావం వ్యక్తంచేశారు. మునుగోడు, సంస్థనారాయణపురం, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఓటర్ల స్పందన చూశానని.. వారంతా ప్రజా శాంతి పార్టీకే అనుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా తనను ఆదరించిన ఓటర్లను ఉద్దేశించి వీడియో రిలీజ్ చేసిన కేఏ పాల్.. గ్రామాల్లో ఉన్న నిరుద్యోగులు, యువత తమ గ్రామాల నుంచి తరలి వెళ్తున్న ఈవీఎంలపై ఓ కన్నేయాల్సిందిగా కోరారు. చండూరు నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ఈవీఎంలపై రెండు రోజుల పాటు దృష్టిపెట్టి అవినీతికి, అడ్డగోలు అక్రమాలకు తావులేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్న తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
కేఏ పాల్ రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల రేసులో బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ నెలకొని ఉందనే సంగతి జగమెరిగిన సత్యం. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ మూడు పార్టీలకు చెందిన నేతలు భారీ సంఖ్యలో మునుగోడు నియోజకవర్గాన్ని అనుక్షణం, అనువణువునా చుట్టేసి రావడటమే ఈ మూడు పార్టీల అభ్యర్థులను రేసులో నిలిచినట్టు గుర్తించేలా చేసింది. అయితే, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ మాత్రం ఈ మూడు పార్టీల ఛరిష్మాను పక్కకు నెట్టేసి తానే 50 వేల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తంచేయడం ఏంటని జనం విస్మయానికి గురవుతున్నారు. కేఏ. పాల్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి నెటిజెన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాదండోయ్.. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించిన ఫలితాల్లోనూ కేఏ పాల్ ప్రభావం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
Also Read : Bandi Sanjay on munugode Bypolls: వాళ్ల అంతు చూస్తాం.. బండి సంజయ్ హెచ్చరిక
Also Read : KCR Press meet: మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ ప్రెస్ మీట్.. గెలుపు ఓటములపై ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి