జూలై నెలలో ఇండియా ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్.. ఆగస్టులో వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు పదవీకాలం పూర్తి కానుంది. రాజ్యాంగపరంగా రెండు అత్యున్నత పదవుల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.
Rajya Sabha: రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా తెలుగు వ్యక్తి డాక్టర్ పీపీకే రామాచార్యులు నియమితులయ్యారు. ఈ మేరకు చైర్మన్ వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీచేశారు. 2018 నుంచి రాజ్యసభ కార్యదర్శిగా రామాచార్యులు పనిచేస్తున్నారు.
ఓ వైపు పూల పండుగ బతుకమ్మ (Bathukamma).. మరోవైపు దేవీ శరన్నవరాత్రుల పూజలతో తెలంగాణ అంతటా సందడి నెలకొంది. అయితే ప్రకృతి పండుగ ( bathukamma festival ) ను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) శుభాకాంక్షలు తెలిపారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) శుక్రవారం (సెప్టెంబరు 25న) కన్నుమూసిన విషయం తెలిసిందే. దాదాపు 40 రోజుల క్రితం ఎస్పీ బాలు (SP Balu) కరోనావైరస్ బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం సీనీ, రాజకీయ ప్రముఖులను, గానాభిమానులను తీవ్రంగా కలచివేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ (Harivansh) పై అనుచితంగా ప్రవర్తించారంటూ.. చైర్మన్ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) 8మంది సభ్యులను ఆదివారం సస్పెండ్ చేశారు.
ప్రపంచం నలుమూలల నుంచి ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) కీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుతో (సెప్టెంబరు 17) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రముఖులు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party ) నుంచి రాజ్యసభ ( Rajya Sabha ) కు నూతనంగా ఎన్నికైన పరిమళ్ నత్వానీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఛాంబర్లో పరిమళ్ నత్వానీతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు.
భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ సారి సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు.. సభ్యులకు పలు షరతులు కూడా విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఉభయసభల అధికారులు.
మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీకి 10 రాజాజీమార్గ్‌లోని తన అధికారిక నివాసంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ముందుగా రక్షణ అధికారులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంజలి ఘటించారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (parliament for monsoon session) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party ) కి చెందిన సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) ప్రమాణ స్వీకారం చేయించారు.
కరోనావైరస్ ( Coronavirus ) విపత్కర పరిస్థితుల్లో ప్రతీచోట సాధారణంగా ఎవరైనా చనిపోయినా.. బంధువులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకి చనిపోతే.. ఆ బాధ వర్ణనాతీతం.. ఎందుకంటే చాలా కుటుంబాలు కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.