Doctor Sriram: హైదరాబాద్: కరోనావైరస్ ( Coronavirus ) విపత్కర పరిస్థితుల్లో ప్రతీచోట సాధారణంగా ఎవరైనా చనిపోయినా.. బంధువులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకి చనిపోతే.. ఆ బాధ వర్ణనాతీతం.. ఎందుకంటే చాలా కుటుంబాలు కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపల్లి జిల్లాలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోగా.. అతని మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించేందుకు డ్రైవర్ నిరాకరించాడు. దీంతో ఆ మృతదేహాన్ని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ శ్రీరామ్ స్మశానవాటికకు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రముఖులందరూ డాక్టర్ శ్రీరామ్ చొరవను అభినందిస్తున్నారు. Also read: Doctor on Tractor: కరోనా రోగి మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్లిన డాక్టర్
ఈ క్రమంలో ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) కూడా డాక్టర్ పెండ్యాల శ్రీరామ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించడంతో డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ (doctor sriram ) స్వయంగా ట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లారని, వారి చొరవను అభినందిస్తున్నాను, డాక్టర్ శ్రీరామ్ చొరవ, అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలి’’ అని ఆకాంక్షిస్తూ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
Also read: COVID-19: ఆస్పత్రి నుంచి తప్పించుకున్న కరోనా పేషెంట్