Rajya Sabha Deputy Chairman Harivansh brought tea for the suspension MPs: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ (Harivansh) పై అనుచితంగా ప్రవర్తించారంటూ.. చైర్మన్ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) 8మంది సభ్యులను ఆదివారం సస్పెండ్ చేశారు. దీంతోపాటు సస్పెన్షన్‌కు గురైన 8 మంది రాజ్యసభ సభ్యులు నిన్నటి నుంచి పార్లమెంటు (parliament) ఆవరణలో ధర్నాకు కూర్చున్న విషయం తెలిసిందే. వారి ఆందోళన రెండోరోజూ సోమవారం కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఆ ఎంపీలందరూ మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలోని గ్రీనరీలోనే రాత్రంతా గడిపారు. ఈ క్రమంలో తనపై దాడికి ప్రయత్నించిన వారికి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఇంటినుంచి స్నాక్స్, టీ తీసుకుని వెళ్లారు. అంతేకాకుండా వారితో కలిసి
కూర్చొని హరివంశ్ కాసేపు ముచ్చటించారు. Also read: Rajya Sabha Ruckus: 8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్
#WATCH: Rajya Sabha Deputy Chairman Harivansh brings tea for the Rajya Sabha MPs who are protesting at Parliament premises against their suspension from the House. #Delhi pic.twitter.com/eF1I5pVbsw
— ANI (@ANI) September 22, 2020
దీనిపై సస్పెన్షన్‌కు గురైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ జీ తమకు టీ, స్నాక్స్ తీసుకొచ్చారని.. వాటిని తాము తిరస్కరించామని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే.. తమకు టీ తీసుకు రావడం మంచిదే అయినప్పటికీ.. హరివంశ్ మైనారిటీలో ఉన్నప్పటికీ బిల్లులను ఎలా ఆమోదిస్తారని సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు అన్నట్లు సమాచారం. అందుకే టీ, స్నాక్స్‌ను తిరస్కరించారని అభిప్రాయపడుతున్నారు.
यह हरिवंश जी की उदारता और महानता को दर्शाता है। लोकतंत्र के लिए इससे खूबसूरत संदेश और क्या हो सकता है। मैं उन्हें इसके लिए बहुत-बहुत बधाई देता हूं।
— Narendra Modi (@narendramodi) September 22, 2020
ఆయన గొప్పతనానికి నిదర్శనం: ప్రధాని మోదీ
తనపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతోపాటు.. అవమానించిన వారికి వ్యక్తిగతంగా డిప్యూటీ చైర్మన్ టీ తీసుకెళ్లడం నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొప్ప సందేశం. ఈ విధంగా చేసినందరుకు వారిని అభినందిస్తున్నానంటూ ప్రదాని మోదీ ట్వీట్ చేశారు. Also read: Building Collapses:18కి చేరిన భివండి మృతుల సంఖ్య