లాక్డౌన్‌ను కొనసాగించాల్సిందే... ప్రధానితో సమావేశంలో కోరే అవకాశం..

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 తర్వాత పొడిగించాలని ఢిల్లీతో సహా ఐదు ప్రధాన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. లాక్ పొడిగింపు విషయంలో కేంద్రం తర్జనభర్జనలో ఉండగా రాష్ట్రాలు

Last Updated : Apr 26, 2020, 11:26 PM IST
లాక్డౌన్‌ను కొనసాగించాల్సిందే... ప్రధానితో సమావేశంలో కోరే అవకాశం..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 తర్వాత పొడిగించాలని ఢిల్లీతో సహా ఐదు ప్రధాన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. లాక్ పొడిగింపు విషయంలో కేంద్రం తర్జనభర్జనలో ఉండగా రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్న ఈ పరిస్థితుల్లో కేంద్రం గందరగోళంలో పడిపోయింది.అయితే రేపు (సోమవారం) జరగబోయే రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ కొనసాగడమే సముచితమని దశలవారీగా మినహాయింపు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. 

గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక వంటి మరో ఆరు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తామని, అస్సాం, కేరళ, బీహార్ రాష్ట్రాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపాయి. మరోవైపు తెలంగాణ ఇప్పటికే లాక్డౌన్‌ను మే 7 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. 

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News