ఆ గేమ్ ఛేంజర్ డ్రగ్ ఏమైంది..?

'కరోనా వైరస్'.. మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ ..కరోనా దెబ్బతో విలవిలలాడుతోంది. చివరకు చైనా, ఇటలీ, స్పెయిన్ కంటే దారుణంగా కరోనా మహమ్మారి దెబ్బకు బలైపోతోంది.

Last Updated : Apr 26, 2020, 01:54 PM IST
ఆ గేమ్ ఛేంజర్ డ్రగ్ ఏమైంది..?

'కరోనా వైరస్'.. మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ ..కరోనా దెబ్బతో విలవిలలాడుతోంది. చివరకు చైనా, ఇటలీ, స్పెయిన్ కంటే దారుణంగా కరోనా మహమ్మారి దెబ్బకు బలైపోతోంది.

'కరోనా వైరస్' శరవేగంగా విస్తరిస్తున్నకారణంగా.. అగ్రరాజ్యం అమెరికాలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు భారత దేశం పాటిస్తున్న విధానాలు,  చికిత్స పద్ధతులను పాటించాలని ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. భారత దేశం ఎదుర్కున్న తీరును ప్రశంసించారు. కరోనా భూతాన్ని పారదోలేందుకు తమకు కూడా సాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.  పాజిటివ్ రోగుల చికిత్సలో ఉపయోగిస్తున్న ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ ను తమకు కూడా సరఫరా చేయాలని అభ్యర్థించారు. 

దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఒక్క అమెరికాకు మాత్రమే కాకుండా దాదాపు 20 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఔషధంపై ఉన్న ఎగుమతుల నిషేధాన్ని పాక్షికంగా సడలించారు. దీంతో అగ్రరాజ్యం అమెరికాకు భారతీయ మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ వెళ్లింది. 

ఆ తర్వాత ఏం జరిగింది..? 
భారత ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. గేమ్ ఛేంజర్ డ్రగ్‌గా అభివర్ణించారు. ఈ డ్రగ్ తో కచ్చితంగా కరోనా మహమ్మారికి అడ్డుకట్టపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. భారత దేశం పంపిన హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్..FDA మోకాలడ్డింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్ల వాడకం వల్ల కరోనా పాజిటివ్ రోగులకు హృద్రోగ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది. గుండె పనితీరులో అసాధారణ మార్పులు వస్తాయని తెలిపింది. దీని వల్ల ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే హృద్రోగ సమస్యలు ఉన్న రోగులకు మరింత ప్రమాదమని హెచ్చరించింది. కాబట్టి హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని ప్రస్తుతానికి ఆపివేయాలని నిర్ణయించింది.

హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ సురక్షితం కాదని.. అలాగే కరోనా వైరస్‌ను నిర్మూలించడంలోనూ ప్రభావం చూపించడం లేదని FDA చెబుతోంది. ఈ కారణంగా అమెరికాలో ప్రస్తుతానికి కరోనా వైరస్ పాజిటివ్ రోగుల చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగించడం లేదు. మరోవైపు అమెరికాలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బెంబేలెత్తిస్తోంది. నిన్న ఒక్క రోజే అగ్రరాజ్యంలో 2 వేల 494 మంది కరోనా మహమ్మారికి బలయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News