'కరోనా' కరాళ నృత్యం

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. భారత దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు శరవేగంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

Last Updated : Apr 26, 2020, 09:59 AM IST
'కరోనా' కరాళ నృత్యం

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. భారత దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు శరవేగంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

నిన్నటి వరకు 25 వేలకు చేరువలో ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా 24 గంటల్లోనే విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 వేల 496 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 19 వేల 868 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి 824 మంది బలయ్యారు. అలాగే 5 వేల 803 మంది చికిత్స తీసుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లారు. 

గత 24 గంటల్లోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 1990 కొత్త కేసులు నమోదు కాగా మొత్తంగా 49 మంది మృతి చెందారు.  నిన్న ఒక్క రోజులోనే ఇంత ఎక్కువగా కేసులు నమోదు కావడం విశేషం. 

మరోవైపు అమెరికాలోనూ కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నిన్న ఒక్క రోజే అగ్రరాజ్యంలో 2 వేల 494 మంది కరోనా మహమ్మారికి బలయ్యారని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ తెలిపింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News