'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. దీంతో దాదాపు 50 రోజులకు పైగా ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు మే 12 నుంచి రైళ్లు పాక్షికంగా పునరుద్ధరించారు.
అమెరికాలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం విలవిలలాడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షలకు చేరుకుంది.
'కరోనా వైరస్' మహమ్మారి కారణంగా బయటకు వెళ్లి ఏ పని చేసుకోవాలన్నా భయం భయంగానే ఉంది. వైరస్ ఎక్కడి నుంచి సోకుతుందనే భయం వెంటాడుతోంది. ఇప్పటి వరకు లాక్ డౌన్ కారణంగా అన్ని దుకాణాలు మూసే ఉన్నాయి. కానీ ఇలా ఎంత కాలం కొనసాగుతుంది..? ఎప్పటికైనా బయటకు వెళ్లి పనులు చేసుకోవాల్సిందే కదా..!
యూపీ, బీహార్ రాష్ట్రాల్లో రోడ్లు నెత్తురోడాయి. తెల్లవారుజామునే విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం జరగడంతో 8 మంది వలస కూలీలు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి.
లాక్ డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం సైతం కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus spread ) నియంత్రణలోకి రాకపోవడంతో చాలా ఐటి సంస్థలు ( IT companies ) ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీనే ( Work from home policy ) ఇంకొంత కాలం కొనసాగిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నాయి.
ఆర్టీసీ బస్సు.. మళ్లీ రైట్ రైట్ అంటూ రోడ్లపై పరుగులు పెట్టనుంది. కరోనా వైరస్ కారణంగా 50 రోజులకు పైగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు తిరిగి రోడ్లపైకి రానున్నాయి. ఐతే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాతే ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు అందుబాటులోకి తీసుకొస్తారు.
'కరోనా వైరస్' ఆర్థిక వ్యవస్థను కమ్మేస్తోంది. దేశవ్యాప్తంగా 54 రోజులపాటు విధించిన లాక్ డౌన్ 3.0 కొనసాగుతోంది. దీంతో పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ బంద్ అయ్యాయి.
'కరోనా వైరస్'విస్తరిస్తున్న నేపథ్యంలో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ కారణంగా ఎవరూ ఆఫీసులకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కంపెనీలు ఆర్ధికంగా చితికిపోతున్నాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం అనుకూలంగా ఉన్న 'వర్క్ ఫ్రమ్ హోం' అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి.
'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 తర్వాత లాక్ డౌన్ 4.0 కూడా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ ఎలా అనే విషయంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ( Bandi Sanjay ) నల్గొండ జిల్లా పెద్దవూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెద్దవూర మండల పరిధిలోని బత్తాయి తోటలను పరిశీలించి రైతులను కలిసేందుకు వచ్చిన బండి సంజయ్... అక్కడే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన వెంట బీజేపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన స్థానిక నేతలు కూడా ఉన్నారు.
కరోనావైరస్ నివారణ కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నిన్న మే11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
కరోనా వైరస్ సోకిన విషయాన్ని దాచినందుకు ముంబయి నుండి గుజరాత్‌కు ప్రయాణించిన 22ఏళ్ల ఓ వైద్యురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మే 4న ముంబయిలో ఈ వైద్యురాలికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిని నివారించేందుకు, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ అమలు ప్రస్తుతం మూడో విడత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
'కరోనా వైరస్' దేశంలో దారుణంగా విస్తరిస్తోంది. ఎంతకీ మహమ్మారి లొంగి రావడం లేదు. దేశవ్యాప్తంగా రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే భారత దేశవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 80 వేల చేరువ వరకు వెళ్లింది.
తెలుగు రాష్ట్రాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఏటా నిర్వహించే ఉత్సవాల్లో తెలంగాణలో ఖైరతాబాద్ గణేషుని సందడి అంతా ఇంతా కాదు. హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి.. స్వామివారికి నిత్య పూజలు చేస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేడు మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతికి సందేశం ఇవ్వనున్నట్టు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది. మే 17తో ప్రస్తుత లాక్ డౌన్ ( Lockdown ) గడువు ముగిసిపోనున్న ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు రాత్రి 8 గంటలకు మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
'కరోనా వైరస్' మహమ్మారితో ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వారిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులతోపాటు కరోనా వారియర్స్ జాబితాలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ కు సంబంధించిన వార్తలను సేకరిస్తూ నిత్యం ప్రజలకు వార్తలను చేరవేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.