'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. దీంతో దాదాపు 50 రోజులకు పైగా ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు మే 12 నుంచి రైళ్లు పాక్షికంగా పునరుద్ధరించారు.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి 15 నగరాలకు రైలు సర్వీసులు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి రెండు రోజుల క్రితం బయల్దేరిన రైలు విజయవాడకు చేరుకుంది. లాక్ డౌన్ తర్వాత బెజవాడ జంక్షన్ లో ఆగిన తొలి రైలు ఇదే కావడం విశేషం. ఈ రైలులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 318 మంది బెజవాడలో దిగారు. ఐతే ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు ఏపీ అధికారులు.
మరోవైపు విజయవాడ జంక్షన్ నుంచి 282 మందిని చెన్నైకి పంపించారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఏపీ అధికారులు పూర్తి చేశారు. ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు రైల్వే స్టేషన్ లో డిసిన్ఫెక్షన్ స్పే చల్లుతున్నారు. అందరూ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
క్వారంటైన్ కేంద్రాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రయాణీకులందరినీ సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపించనున్నారు. ఇందుకోసం విజయవాడలో బస్సులు ఏర్పాటు చేశారు. నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం, కడప, గుంటూరు, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల బస్సులు ఏర్పాటు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..