భవిష్యత్‌లో 'హెయిర్ కట్' ఇలా..!!

'కరోనా వైరస్' మహమ్మారి కారణంగా బయటకు వెళ్లి ఏ పని చేసుకోవాలన్నా భయం భయంగానే ఉంది. వైరస్ ఎక్కడి నుంచి సోకుతుందనే భయం వెంటాడుతోంది. ఇప్పటి వరకు లాక్ డౌన్ కారణంగా అన్ని దుకాణాలు మూసే ఉన్నాయి.  కానీ ఇలా ఎంత కాలం కొనసాగుతుంది..? ఎప్పటికైనా బయటకు వెళ్లి పనులు చేసుకోవాల్సిందే కదా..!

Last Updated : May 14, 2020, 10:14 AM IST
భవిష్యత్‌లో 'హెయిర్ కట్' ఇలా..!!

'కరోనా వైరస్' మహమ్మారి కారణంగా బయటకు వెళ్లి ఏ పని చేసుకోవాలన్నా భయం భయంగానే ఉంది. వైరస్ ఎక్కడి నుంచి సోకుతుందనే భయం వెంటాడుతోంది. ఇప్పటి వరకు లాక్ డౌన్ కారణంగా అన్ని దుకాణాలు మూసే ఉన్నాయి.  కానీ ఇలా ఎంత కాలం కొనసాగుతుంది..? ఎప్పటికైనా బయటకు వెళ్లి పనులు చేసుకోవాల్సిందే కదా..!

ఇప్పటి వరకు లాక్ డౌన్ కారణంగా క్షౌరశాలలు మూసే ఉన్నాయి. దీంతో చాలా మంది మగవాళ్లు హెయిర్ కట్ లేకుండానే దాదాపు 2 నెలల నుంచి కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిమిత ఆంక్షలతో హెయిర్ కట్ సెలూన్లు తిరిగి తెరుస్తున్నారు. అయినప్పటికీ జుట్టు కత్తిరించుకోవాలంటే భయం భయంగానే పరిస్థితి ఉంది. దీంతో హెయిర్ కట్ సెలూన్లకు వెళ్లాలంటే  జనం ఒకటికి 10సార్లు ఆలోచిస్తున్నారు. కానీ వెళ్లక తప్పనిసరి పరిస్థితి. 

ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ లో హెయిర్ కట్ సెలూన్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఐతే వైద్యులు, పారామెడికల్ సిబ్బంది లాగానే హెయిర్ కట్ సెలూన్లలో పని చేసే సిబ్బంది కూడా ఇందుకు పరిష్కారం కనుక్కున్నారు. హెయిర్ కట్ సెలూన్లలో అంతా డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రేతో శుభ్రం చేస్తున్నారు. మరోవైపు జుట్టు కత్తిరించుకునేందుకు వచ్చే వారు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించి రావాలని సూచిస్తున్నారు. కచ్చితంగా సామాజిక దూరం పాటించాలనే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. 

అంతే కాదు హెయిర్ కట్ చేసే సిబ్బంది కూడా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్..PPE కిట్లు ధరిస్తున్నారు. ముఖానికి ఫేస్ షీల్డ్ తోపాటు ఫేస్ మాస్క్ కూడా పెట్టుకుంటున్నారు. తద్వారా ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉంటుంది. మరోవైపు ప్రతిదీ శుభ్రంగా నిర్వహించడం వల్ల పారిశుద్ధ్యానికి అవసరమైన ఉత్పత్తులపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని సెలూన్ల యజమానులు వాపోతున్నారు. దీని వల్ల తమ వ్యయం పెరిగిందంటున్నారు. దీన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఐతే కొంత మంది వినియోగదారులు పెంచిన ధరలు ఇవ్వడానికి అయిష్టంగా ఉన్నారని చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News