మళ్లీ రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సు..!!

ఆర్టీసీ బస్సు.. మళ్లీ రైట్ రైట్ అంటూ రోడ్లపై  పరుగులు పెట్టనుంది. కరోనా వైరస్ కారణంగా 50 రోజులకు పైగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు  తిరిగి రోడ్లపైకి రానున్నాయి. ఐతే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాతే ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు అందుబాటులోకి తీసుకొస్తారు.

Last Updated : May 13, 2020, 01:21 PM IST
మళ్లీ రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సు..!!

ఆర్టీసీ బస్సు.. మళ్లీ రైట్ రైట్ అంటూ రోడ్లపై  పరుగులు పెట్టనుంది. కరోనా వైరస్ కారణంగా 50 రోజులకు పైగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు  తిరిగి రోడ్లపైకి రానున్నాయి. ఐతే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాతే ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు అందుబాటులోకి తీసుకొస్తారు.

ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరింపచేయడానికి ఏపీఎస్ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది.  లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి  రానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా  పాక్షికంగా రైలు సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో త్వరలోనే బస్సు సర్వీసులు  కూడా ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ 3.0 పూర్తి కాగానే.. అంటే మే 18 నుంచి బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపోల్లో ఉన్న అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అంతర్గత సర్క్యులర్ విడుదల చేసినట్లు సమాచారం. 
 
సీటింగ్ మార్పు ఇలా..
అలాగే  కరోనా వైరస్ ఇప్పటికీ లొంగి రాలేదు... కాబట్టి.. బస్సుల్లోనూ సామాజిక దూరం తప్పనిసరి. ఈ క్రమంలో పరిమిత సంఖ్యలోనే బస్సుల్లోకి ప్రయాణీకులను అనుమతిస్తారు. అంతే కాదు సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్ల సంఖ్య కుదించారు.  మొత్తం 36 సీట్లు ఉన్న బస్సుల్లో సీట్ల సంఖ్యను 26కు పరిమితం చేశారు. అంతే కాదు గతంలో ప్రయాణీకులు నడిచే దారిలో సీట్లు ఏర్పాటు చేశారు.  అంటే ఇప్పటి నుంచి మూడు వరుసలలో ఒక్కోసీటు మాత్రమే ఉంటుందన్నమాట. తద్వారా ప్రయాణీకుల  మధ్య సామాజిక దూరం ఏర్పాటు అవుతుంది.

ఆన్‌లైన్‌లోనే టికెట్లు..
అలాగే  బస్సులో కేవలం 50 శాతం మంది ప్రయాణీకులు మాత్రమే ఉండేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు టికెట్లు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే విక్రయించాలని నిర్ణయించారు. బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే బస్టాండ్లలో కండక్టర్లు ఫోన్‌ పే, గూగుల్‌ పే, ద్వారా టికెట్లు బుక్‌ చేస్తారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News