మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు.. ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నరు. తెలంగాణాకి వచ్చే వారందరికీ స్వాగతం.. వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి వెళ్ళండి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.
గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది. ప్రలోభాలకు గురవ్వకుండా వరుసగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని కరీంనగర్ లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రముఖ పార్టీలు పరస్పరం విమర్శలు.. ఛాలెంజ్ లు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ వివరాలు..
Aasara Pensions: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ప్రస్తావించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే! రానున్న ఎన్నికల్లో తామే ప్రభుత్వాన్ని నిర్మించబోతున్నట్లు.. దక్షణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వరుసగా 3 సార్లు ఎన్నిక అవ్వలేదు.. కానీ మేము చేసి చూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
సికింద్రాపూర్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రధాని మోడీ ఆపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు.
Minampalli Hanmantha Rao: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, ఆయన కొడుకు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భువనగిరి నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నక్క ప్రభాకర్ కూడా వారితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Minister Harish Rao About Progress in Telangana Healh Department: 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటే... ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరుకున్నామని.. రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నాం అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.. వైద్య సిబ్బంది సమిష్టి కృషివల్లే ఇది సాధ్యమైందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఖుషి సినిమా తరువాత సమంత సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత గురించి ఒక పుకారు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. అదేంటంటే సమంత పాలిటిక్స్ లోకి రానుంది అని.. అదెంత వరకు నిజమో తెలుసుకుందాం!
Revanth Reddy Counter to KTR: అమరుల తల్లుల కడుపుకోత గుర్తించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సకుటుంబ సమేతంగా తెలంగాణకు వస్తుంటే.... రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీతో అంటకాగి కుట్రలు చేస్తున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Medical Colleges In Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తోందని.. ఈ నెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.
Minister Prashanth Reddy Comments on BJP and Congress: తెలంగాణ ప్రజలందరూ కేసిఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులే అని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు కేసిఆర్ సర్కార్ ఆసరగా నిలుస్తోందని అన్నారు.
YS Sharmila Shows Her Sarcasm To BRS MLC Kalvakuntla Kavitha: మహిళా బిల్లుపై దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ కవితకు వైఎస్ షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ పార్టీ జాబితా చూసి మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చారా ? లేదా ? అనేది క్యాలిక్యులేటర్తో మీరే లెక్కించండి అని చురకలంటించారు.
KCR Gives Rs 1 Cr to Sai Chand's Wife Rajini: సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయిలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా ఉంటారు అని డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలిపారు.
Kamareddy MLA Election: కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు అనుకూలంగా ఓటేస్తామంటూ 10 గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వయంగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రావడం ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Revanth reddy Speech at SC, ST Decleration: తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేతిలో అత్యధికంగా దగాకు గురైంది దళితులు, గిరిజనులే అని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు. అవును.. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
KCR Praises Allu Arjun For Winning Best Actor Award at National Film Awards: కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తమ నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర కళాకారుడు కావడం, తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు.
KCR vs Shabbir Ali vs Venkataramana Reddy: కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కామారెడ్డి అసెంబ్లీ ముఖ చిత్రం మారిపోయింది. ఏకంగా సీఎం కేసీఅర్ ఇక్కడి నుండి పోటీకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నూతనోత్తేజం రాగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో మాత్రం నైరాశ్యం మొదలైంది. మొత్తానికి కామారెడ్డిలో రాజకీయం వేడెక్కింది.
Shabbir Ali About KCR Contesting in Kamareddy: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అని ఆరోపించిన షబ్బీర్ అలీ... తండ్రి కేసీఆర్ లిక్కర్ షాపులు పెడితే, కూతురు కవిత ఆ లిక్కర్ దందాకి రాణి అయిందని ఎద్దేవా చేశారు.
Revanth Reddy Slams KCR : బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే.. ఆ పదవిని బీసీకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారో ఆలోచించండన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 115 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. ముదిరాజులపై కేసీఆర్ పగబట్టారు. 50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు... అరశాతం ఉన్న కేసీఆర్ వర్గానికి 4 మంత్రి పదవులా? ఇచ్చారని ఆయన విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.