Revanth Reddy కేసీఆర్ పై మండిపడ్డ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

తెలంగాణాలో  ఎన్నికల వేడి మొదలైంది. ప్రముఖ పార్టీలు పరస్పరం విమర్శలు.. ఛాలెంజ్ లు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2023, 08:29 PM IST
Revanth Reddy కేసీఆర్ పై మండిపడ్డ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికల శంఖం మోగింది. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుండి ఆయా పార్టీలు సమరానికి సిద్ధం అవుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు పార్టీ వర్గాలు ఎన్నికల ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విడుదల వారీగా ప్రకటిస్తూ వస్తుంది. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. 

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరీష్ రావ్, కేసీఆర్, కేటీఆర్ పదే పదే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు.  డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని వాళ్లు ఆరోపిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీనే  హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు, లిక్కర్ పంచి ఎన్నికల్లో గెలవాలని చూశారు. బీజేపీ, బీఆరెస్ పోటీ పడి ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయి.. నెలరోజుల్లో 60 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే... మునుగోడు ఉప ఎన్నిక జరిగిన 30 రోజుల్లో 300 కోట్ల మద్యం అమ్ముడయింది. 

కానీ కాంగ్రెస్ పార్టీ మునుగోడులో చుక్క మందు, డబ్బు పంచలేదు. దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆనాడు విశ్లేషకులు చెప్పారు. మునుగొడు ఉప ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ ధన ప్రవాహం జరిగింది. అందుకే మాపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ కు నేను సూటిగా సవాల్ విసురుతున్నా.. చుక్క మందు ,డబ్బు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసురుతున్నా.. ఈ విషయంపై అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దామని ఆహ్వానించా.. కేసీఆర్ రాకపోగా.. అమరుల స్థూపం వద్దకు వెళితే నన్ను అరెస్టు చేస్తారా.. ? ముందస్తు అనుమతి పేరుతో పోలీసులు నన్ను నిర్బంధించారని పేర్కొన్నారు. 

కార్యకర్తలపై దాడులు.. 
తెలంగాణ ప్రజలు కోరుకునేది.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి.. కానీ నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ తన కుటుంబానికే పరిమితం చేశారు. మేం విసిరిన సవాల్ కేసీఆర్ స్వీకటించలేదు.. అంటే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ డబ్బు,  మద్యాన్ని నమ్ముకున్నారని స్పష్టంగా తెలిసింది. నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబం పరువును మంట వ్యవహరించింది.
ప్రేమ విఫలమై చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారు..? నిర్భయ చట్టాన్ని ఉల్లంఘించి వివరాలు ఎలా బయటపెడతారు.. ? కోర్టు అనుమతితో ఆధారాలు తీసుకున్నాకే వివరాలు వెల్లడించాలి.. కానీ అవేవీ చేయలేదు.

Also Read: Ap Government: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫెయిల్ అయినా మళ్లీ పదో తరగతిలో చేరవచ్చు

నేను ప్రశ్నిస్తే.. ప్రెస్ మీట్ పెట్టిన అధికారిని కాకుండా వేరే అధికారిని సస్పెండ్ చేశారు. రిటైర్ అయిన అధికారులను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది. వారిని ప్రయివేట్ సైన్యంగా చేసుకుని కేసీఆర్ మాపై దాడులు చేయిస్తున్నారు. నిన్న గన్ పార్క్ వద్ద నిరసనలు చేసినవారికి నిబంధనలు వర్తించవా.. ? కాంగ్రెస్ ను తిట్టి ధర్నా చేసే వారికి రిటర్నింగ్ అధికారి అనుమతి అవసరం లేదా.. ? మేం ఇచ్చిన హామీలలో అన్నింటినీ రెట్టింపు చేసి కేసీఆర్ మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. మరి మేం 2లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పాం.. మరి కేసీఆర్ ఉద్యోగ నియామకాల ఊసే ఎత్తలేదు. ప్రవలిక కుటుంబ సభ్యులను రేపు రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లాలనుకుంటే.. బీఆరెస్ నేతలను పంపి ఆ కుటుంబాన్ని ప్రగతి భవన్ లో బంధిస్తారట.. కేసీఆర్ ఇంతటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారు.

Also Read: Anti Oxidants: ఈ మూడు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటే చాలు, నిత్య యౌవనం, అందమైన చర్మం మీదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News