నిజామాబాద్ సభలో ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడాడని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భీంగల్ మండలం సికింద్రాపూర్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. కేసిఆర్ గారిపై ప్రధాని మోడీ అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ప్రధాని స్థాయి వ్యక్తి ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
కేసిఆర్ గారిపై చేసిన అవినీతి ఆరోపణలకు ఆధారాలు చూపెట్టకుంటే మోడీ యావత్ తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు మోడీనే అత్యంత అవినీతి పరుడని అంతర్జాతీయ మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయన్నారు. దేశంలో ప్రభుత్వ సంస్థలన్నీ తన మిత్రుడు అదానికీ అప్పనంగా కట్టబెడుతున్నడని, ఆస్ట్రేలియా బొగ్గు గనులు, శ్రీలంక లో పవర్ ప్రాజెక్ట్ పనులు ప్రధాని మోడీ ప్రమేయం తోనే వచ్చాయని ఆ దేశంలో ఉన్నత స్థాయి వ్యక్తులే బహిరంగంగా మాట్లాడారని, అక్కడి దేశ ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి నిరసనలు చేశారని అన్నారు.
మోడీ సచ్చిలుడైతే అవి అబద్ధాలు అని నిరూపించాలని డిమాండ్ చేశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మొదలు అధాని అక్రమాలపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. 12 లక్షల కోట్ల రూ. దేశ ప్రజల సొమ్మును తన కార్పొరేట్ మిత్రుల కోసం రుణమాఫి చేశాడని అట్లా అక్రమంగా వచ్చిన సొమ్ముతో 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కుల్చారని మండిపడ్డారు. తెలంగాణలో ఒక్కోఎమ్మెల్యేకు 100 కోట్లు పెట్టి కొంటామని బీజేపీ పంపిన స్వాములు వీడియో రికార్డు మాటలు దేశమంతా చూసిందని అన్నారు. అవినీతికి కేరాఫ్ మోడీ అని దుయ్యబట్టారు.
Also Read: ICC World Cup 2023: వరల్డ్ కప్ ఆరంభానికి ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు
కేసిఆర్ ఎన్డీయే లో కలుస్తా అన్నాడని ఓ కట్టుకథ అల్లి బహిరంగ సభలో చెప్పడం మోడీ చౌకబారు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. కేసిఆర్ కు ఎన్డీయేలో కలిసే అవసరమే లేదని,బీజేపీ వాళ్లే ఎన్ని సార్లు అడిగినా మీ ప్రతిపాదన కేసిఆర్ రిజెక్ట్ చేశాడని తెలిపారు. కేటీఆర్ సీఎం కావడానికి మోడీ బోడి ఆశీర్వాదం అవసరం లేదని,మాకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం కావడానికి 60 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం సరిపోతుందని అన్నారు. కేసిఆర్ ఆశీర్వదిస్తే కెటిఆర్ సీఎం ఐతారు తప్పా..మోడీ అవసరం,బోడి ఆశీర్వాదం ఏ కోశానా అవసరం లేదని మంత్రి వేముల తేల్చి చెప్పారు.
Also Read: Poco M5 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO M5 మొబైల్‌పై 50 శాతం తగ్గింపు..ఈ హాట్ డీల్ మీ కోసమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook