మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై శనివారం ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై స్పందిచిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఎప్పటిలాగానే మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈసారి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆమె వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని..కేసు నమోదు చేయాలని బాంద్రా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి, దివంతగ జయలలిత బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవటే తను అమ్మపాత్రో ఎలా ఒదిగిపోయానో చూపిస్తూ ఫోటోలు షేర్ చేసింది కంగనా...
వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనమవుతున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు చిక్కొచ్చిపడింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కర్నాటకలోని ఓ జ్యుడీషియల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో ముఖ్యాంశాలుగా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput) అనుమానస్పద మరణం నాటినుంచి క్వీన్ కంగనా బాలీవుడ్ ( Bollywood) లో నెపోటిజంపై గళమెత్తింది.
Actress Payal Ghosh allegations on Anurag Kashyap: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణ పారదర్శకంగా లేదని.. ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra govt ) సుశాంత్ మృతికి కారకులైన బాలీవుడ్ ప్రముఖులకు కొమ్ము కాస్తోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut ) మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే.
Kangana Ranaut lauds Telugu film industry: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పటి నుంచి కంగనా రనౌత్ పేరు వార్తల్లో మార్మోగని రోజు లేదు. సుశాంత్ మృతికి ( Sushant Singh Rajput death case ) బాలీవుడ్ పరిశ్రమలోని కొంతమంది పెద్దల వైఖరే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్..
భారత చలన చిత్ర పరిశ్రమలో రోజుకో వివాదం రాజుకుంటోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. యూపీలోని గౌతమబుద్ధనగర్ జిల్లా గ్రేటర్ నోయిడా మహా నగరంలో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) ఆత్మహత్య నాటినుంచి నటి కంగనా రనౌత్ ( kangana ranaut ) అందరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా.. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మొదలుపెట్టి ఏకంగా మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంపై, అగ్ర నాయకులపై పలు ఆరోపణలు సైతం చేసింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వ్యవహారం సంగతేమో గానీ..కంగనా మాత్రం అందరిపై విరుచుకుపడుతోంది. మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి టార్గెట్ కాగా..నిన్న జయాబచ్చన్. ఇప్పుడు ఊర్మిళా మటోండ్కర్. ఊర్మిళానైతే ఏకంగా అడల్ట్ స్టార్ అంటూ వ్యాఖ్యానించింది.
బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై రెండురోజుల నుంచి పార్లమెంటులో వాడీవేడిగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో చాలామంది డ్రగ్స్‌కు బానిసయ్యారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ ( Ravi Kishan ) చేసిన వ్యాఖ్యలపై బీగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి, ఎస్పీ ఎంపీ జయ బచ్చన్ ( Jaya Bachchan ) ఆగ్రహం సైతం వ్యక్తంచేశారు.
పార్లమెంట్ ( parliament) లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ( Drugs ) వినియోగంపై వాడీవేడిగా చర్చజరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ( jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు
పార్లమెంట్లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ( Drugs ) వినియోగం విపరీతంగా ఉందంటూ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన కామెంట్స్‌పై అగ్రనటుడు అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ( jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు.
మహారాష్ట్రలో ఓ వైపు కంగనా రనౌత్, మరోవైపు నేవీ మాజీ అధికారి మదన్‌శర్మ శివసేన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు.
https://zeenews.india.com/telugu/tags/Kangana-Ranautభారత సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా.. డ్రగ్స్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ యువనటుడు సుశాంత్ (Sushant Singh Rajput) అకాల మరణం నాటినుంచి ఇటు బాలీవుడ్లో.. అటు రాజకీయ పార్టీల్లో వైరం రాజుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ డెత్ కేసు విచారణలో బాలీవుడ్లో డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు పలువురిని అరెస్టుచేసి విచారిస్తోంది.
Reason behind Kangana Ranaut's Y-plus security: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా ఎండగడుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కి కేంద్రం వై-ప్లస్ కేటగిరి భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ఐతే కంగనాకు వై-ప్లస్ కేటగిరి సెక్యురిటీ కల్పించిన విషయంలో కేంద్రంపైనా శివసేన పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ( Union Minister of State for Home G Kishan Reddy ) ఈ వివాదంపై స్పందించారు.
కంగనా రనౌత్ ముంబైకి వచ్చిన రోజే ముంబై పురపాలక శాఖ అధికారులు (BMC) ముంబైలోని పాలి హిల్స్‌లో ఉన్న నటి కార్యాలయాన్ని అక్రమ కట్టడమంటూ జేసీబీలతో కూల్చేశారు. అయితే తనకు ముందుగా నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉద్ధవ్ థాకరేకు సవాల్ విసిరిన తరువాత ఇప్పుడాయన పార్టీపై విమర్శలు గుప్పించింది. శివసేన కాదని...సోనియా సేన అని ఎద్దేవా చేసింది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చెప్పదలుచుకున్నారో.. ఖరాఖండిగా చెప్పేస్తారు. అందుకే ఆయన తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తారు ఎప్పుడూ తనదైన స్టైల్లో సినిమాలు తీసి వివాదాస్పద దర్శకుడిగా.. పేరు గడించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి నిప్పులు చెరిగింది. ఈసారి ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికే సవాల్ విసిరింది. నీ అహంకారం నేలమట్టమవుతుందంటూ ఏకవచనంలో బెదిరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.