సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) మరణ వ్యవహారం సంగతేమో గానీ..కంగనా ( kangana ) మాత్రం అందరిపై విరుచుకుపడుతోంది. మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి టార్గెట్ కాగా..నిన్న జయాబచ్చన్. ఇప్పుడు ఊర్మిళా మటోండ్కర్. ఊర్మిళానైతే ఏకంగా అడల్ట్ స్టార్ అంటూ వ్యాఖ్యానించింది.
బాలీవుడు నటుడు ( Bollywood Actor ) సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం రేపుతున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో ఎన్నడూ లేని వివాదాలన్నీ తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా నటి కంగనా రనౌత్ ( kangana ranaut ) వ్యవహారంతో రచ్చరచ్చవుతోంది. కంగనా చేస్తున్న వ్యాఖ్యలైతే పార్లమెంట్ లో కూడా ప్రస్తావనకొస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ( Shiv sena mp sanjay raut ) , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( Maharashtra cm udhav thackeray ), తనయుడు ఆదిత్య ధాకరే లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తరువాత బీజేపీ ఎంపీ రవి కిషన్ ( Bjp mp ravi kishan ) వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన జయాబచ్చన్ ( jaya bachan ) ను కూడా వదల్లేదు. ఆమెపై కూడా పెద్దఎత్తున విరుచుకుపడింది.
సినీ పరిశ్రమలో తాను లేడీ ఓరియెంటెడ్ సిినిమాలతో ట్రెండ్ సృష్టించానని, దేశభక్తి విలువల్ని పెంచే సినిమాలు కూడా చేశానంది. కొంతమంది సినిమా పరిశ్రమ గురించి గొప్పగా చెబుతున్నారని అయితే..రెండు నిమిషాల పాత్ర కోసమైనా లేదా ఐటమ్ సాంగ్ కోసమైనా సరే హీరోతో పడుకునే దుస్థితి ఏర్పడిందని కంగనా వ్యాఖ్యానించింది. అటువంటి ఇండస్ట్రీ గురించి జయాబచ్చన్ ఏం మాట్లాడుతున్నారు..హీరోతో గడిపితేనే అవకాశాలు వస్తాయా అని ప్రశ్నించింది. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై సీనియర్ నటి ఊర్మిళ ( Urmila matondkar ) అభ్యంతరం తెలిపింది. నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వాగడం సరికాదని స్పష్టం చేసింది.
అంతే...ఊర్మిళ వ్యాఖ్యలపై పెద్దఎత్తున విరుచుకపడింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఎవ్వరూ ఊహించని విధంగా కామెంట్స్ చేసింది ఆమెపై. ఊర్మిళకు నటన కూడా సరిగ్గ రాదని..ఆమె ఒక సాఫ్ట్ పోర్న్ స్టార్ అని అడల్ట్ స్టార్ అని ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి మరింతగా వివాదాస్పదమైంది. ఊర్మిళపై కంగనా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. Also read: Rakul Preet Singh: ఆ వార్తలను నిలువరించాలంటూ.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్