Hardik Pandya | గత కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న హార్ధిక్ పాండ్యా న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక అవుతాడని అంతా భావించారు. ఫిట్ నెస్ టెస్ట్‌లో విఫలమైన కారణంగా హార్ధిక్‌ను కివీస్ పర్యటనకు ఎంపిక చేయలేదని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.
నాల్గో వన్డేలో టీమిండియాపై న్యూజిల్యాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో కివీస్ గెలుపొందింది. 93 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ..14.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఫలితంగా న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ లో వన్డే సిరీస్ లో 1-3 తేడాలో న్యూజిల్యాండ్ నిలిచింది. తొలి మూడు వన్డేల్లో టీమిండియా విజయం సాధించి సిరీస్ కైససం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యచ్ లో కివీస్ సత్తా చాటి టీమిండియా ఆధిపత్యానికి అడ్డుకట్టవేయగల్గింది.
న్యూజీలాండ్‌తో 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్న భారత్.. కివిస్ ఆటగాళ్లను 38 ఓవర్లకే ఆలౌట్ చేసింది. నేపియర్‌లో జరుగుతున్న ఈ వన్డేలో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి తమ ప్రతాపం చూపించారు.
భారత్ Vs న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో భారత్ గెలిచింది. రెండు మ్యాచ్ లను గెలుపొంది సిరీస్ ను సొంతం చేసుకుంది. వర్షం కారణంగా మంగళవారం తిరువనంతపురంలో మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించడంతో ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ లో భారత్ విజయ ఢంకా మోగించింది. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచినా న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ తీసుకుంది. భారత్ నిర్ణీత 8 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేయగా, 68 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 8 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేశారు.
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం జరిగిన రెండో భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ లో కోహ్లీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. రాజ్‌కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో శనివారం న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో 65 పరుగులు చేసిన కోహ్లీ టీ20లలో 7 వేల పరుగులు సాధించిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. 212వ టీ20 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం ద్వారా అత్యంత వేగవంతంగా 7 వేల పరుగులు సాధించిన రెండో క్రికెటర్ అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ కూడా చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.