ఇండియా vs న్యూజీలాండ్ తొలి వన్డే మ్యాచ్: 38 ఓవర్లకే కివీస్ ఆలౌట్

న్యూజీలాండ్‌తో 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్న భారత్.. కివిస్ ఆటగాళ్లను 38 ఓవర్లకే ఆలౌట్ చేసింది. నేపియర్‌లో జరుగుతున్న ఈ వన్డేలో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి తమ ప్రతాపం చూపించారు.

Last Updated : Jan 23, 2019, 02:17 PM IST
ఇండియా vs న్యూజీలాండ్ తొలి వన్డే మ్యాచ్: 38 ఓవర్లకే కివీస్ ఆలౌట్

న్యూజీలాండ్‌తో 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్న భారత్.. కివిస్ ఆటగాళ్లను 38 ఓవర్లకే ఆలౌట్ చేసింది. నేపియర్‌లో జరుగుతున్న ఈ వన్డేలో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి బంతుల ధాటికి న్యూజిలాండ్ జట్టు 157 పరుగులకే చాపచుట్టేసింది. కుల్‌దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి రాణించగా, ఆట ఆరంభంలోనే మూడు మెయిన్ వికెట్స్ తీసి మహమ్మద్ షఫి న్యూజీలాండ్ వెన్ను విరిచాడు. దీంతో తొలి వన్డేలోనే న్యూజీలాండ్‌కి గట్టి షాక్ తగిలింది. చాహాల్‌కు 2, జాదవ్‌కు 1 వికెట్ లభించింది. 

న్యూజీలాండ్ జట్టు పర్‌ఫార్మెన్స్ విషయానికొస్తే, 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద న్యూజీలాండ్ జట్టు కెప్టేన్ కేన్ విలియమ్సన్ కుల్‌దీప్ బౌలింగ్‌లో విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అవడంతో ఆ జట్టు పథనం ప్రారంభమైంది. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టే పెవిలియన్ బాటపట్టారు. 145 పరుగుల వద్ద 6 వికెట్లతో ఉన్న జట్టు మరో 12 పరుగులు సాధించేలోపే చివరి 4 వికెట్లను కోల్పోయింది. 158 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగనున్న భారత జట్టు విజయంపై ధీమాగానే కనిపిస్తోంది.

Trending News