Harish Rao Says KCR Is Not Plant He Is Kalpavriksha: ఇచ్చిన హామీలపై దేవుళ్లపై ఒట్లు వేసి రేవంత్ రెడ్డి మోసం చేశాడని.. అతడి డీఎన్ఏ అబద్దాలు ఆడడమే అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు విమర్శించారు. రుణమాఫీపై రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
KT Rama Rao Reacts Achampet Incident: లోక్‌సభ ఎన్నికల అనంతరం నాగర్‌కర్నూల్ లోక్‌సభ సెగ్మెంట్లోని అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇదే నా మీరు కోరే ప్రేమ దుకాణం అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ ఇలాంటి దాడులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది.
YS Sharmila Challenge to KTR: టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందని టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన స్టైలులో ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కి కౌంటర్ ట్వీట్ చేసిన షర్మిల.. ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు.
BJP Deal With TRS MLAs: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రకు తెరలేపిందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఆరోపించారు.
Deal To Buy TRS MLAs: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి ఓ ముఠా రంగంలోకి దిగిందని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఈ డీల్‌కి పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.