GHMC Elections: పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్..నిజమేనా

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిస్తే..సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ఆరోపించారు. 

Last Updated : Nov 24, 2020, 04:10 PM IST
  • గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ బండి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • బీజేపీ గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్
  • 1948లో హైదరాబాద్ ను పాకిస్తాన్ లో కలపాలని ఎంఐఎం చెప్పిందని గుర్తు చేసిన బీజేపీ
GHMC Elections: పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్..నిజమేనా

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిస్తే..సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ఆరోపించారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల ( Ghmc Elections ) ప్రచారంలో  వేడి రాజుకుంటోంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే..పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ ( Surgical Strikes in Old City ) నిర్వహిస్తామంటూ దుమారం రేపారు.  పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీయులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. ఉప్పల్, రామంతపూర్‌లలో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ ( Bandi Sanjay ) చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై ప్రజల్ని మోసం చేస్తున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్యం చేశారు. 

1948లో హైదరాబాద్ నగరాన్ని పాకిస్తాన్లో కలపాలని ఎంఐఎం ( MIM ) కోరిన సంగతిని  బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు గుర్తు చేశారు. బీహార్ ఎన్నికల్లో గెల్చిన ఎంఐఎం ఎమ్మెల్యే..హిందూస్తాన్ పేరుతో ప్రమాణ స్వీకారం చేయనన్న సంగతిని ప్రస్తావించారు. ఢిల్లీ మున్సిపాలిటీలో 30 ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వచ్చిందని..బీజేపీ గెలిచిన చోట ఎక్కడా మతవిద్వేషాలు లేవన్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో సునామీ రాబోతుందన్నారు. Also read: GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో 1,122 మంది 

Trending News