GHMC Elections 2020: గ్రేటర్ పోరులో..టీఆర్ఎస్ పొత్తుపై క్లారిటీ ఇచ్చిన ఒవైసీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టత ఇచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు లేదని ఒవైసీ స్పష్టం చేశారు. 

Last Updated : Nov 22, 2020, 03:59 PM IST
GHMC Elections 2020: గ్రేటర్ పోరులో..టీఆర్ఎస్ పొత్తుపై క్లారిటీ ఇచ్చిన ఒవైసీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ( Greater Hyderabad municipal corporation elections )పై ఎంఐఎం  ( MIM ) అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టత ఇచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు లేదని ఒవైసీ స్పష్టం చేశారు. 

గ్రేటర్ ఎన్నికల నగారా మోగకముందే తెలంగాణ ( Telangana )అధికారపార్టీ టీఆర్ఎస్ ( TRS ) , మజ్లిస్ ( Majlis ) నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు పార్టీల మధ్య పొత్తుపై అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో( GHMC Elections ) టీఆర్ఎస్ తో పొత్తు లేదని ఎంఐఎం నేత ఒవైసీ స్పష్టం చేశారు. మొత్తం 52 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. చాలా డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీనే తమకు పోటీ అని చెప్పారు. హైదరాబాద్ కు వరదలొస్తే సాయం చేయని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికల్లో దానిపై విమర్శలు చేస్తోందన్నారు. బీజేపీ హిందూత్వాన్ని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ముస్లింలకు లేదా అని ఒవైసీ ప్రశ్నించారు. 

ప్రగతి భవన్ వేదికగా అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin owaisi ), కేసీఆర్ ( KCR )మధ్య కీలక భేటీ కూడా జరిగింది. అటు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాల్నిగెల్చుకోగా..ఎంఐఎం 40 స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు రెండు పార్టీల మధ్య పోటీనే లేదని ఒవైసీ తేల్చి చెప్పారు. Also read: Telangana: ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు వాయిదా

Trending News