Vijayawada fire accident Death Toll | విజయవాడలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదం మృతుల సంఖ్య 11కి చేరింది.
విజయవాడ పట్టణంలో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan On Vijayawada fire accident) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయవాడలో భారీగా అగ్ని ప్రమాదం (Fire Accident In Vijayawada) సంభవించింది. కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.
కోవిడ్19 ఆసుపత్రిలో గురువారం వేకువజామున ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం (Fire Accident at COVID19 Hospital) ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.
ఫ్యాక్టరీలో సంభవించిన భారీ పేలుడు కార్మికుల జీవితాలను బుగ్గిపాలు చేసింది. కార్మికుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడు (Ghaziabad Factory Explosion)లో ఏడుగురు కార్మికులు చనిపోగా, మరో నలుగురు కార్మికులకు కాలిన గాయాలయ్యాయి.
వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి ఒక్కసారిగా మూడు కోచ్‌లు వేరయ్యాయి. ఈ క్రమంలో కోచ్‌లలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ కింద పడిపోయాయి. దీంతో అగ్ని ప్రమాదం సంభవించింది. నిర్జన ప్రదేశం కావడంతో ఏ ఇబ్బంది కలగలేదు.
Fire Accident | ఇండస్ట్రీయల్ ఏరియాలో ఒకచోట మొదట నిప్పు రవ్వ భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసింది. మంటల్ని అదుపు చేసేందుకు ఘటనా స్థలానికి 20కి పైగా అగ్నిమాపక యంత్రాలు వెళ్లాయి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
త్రిపుర రాజధాని అగర్తలలో ఉన్న జీబీ పవర్ స్టేషన్లో ( GB power station ) బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం సమయంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో విద్యుత్ కేంద్రం పరిసరాల్లోని ఆకాశమంతా దట్టమైన పొగతో కప్పుకుపోయింది.
ముంబైలోని ఓ అపార్టుమెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. నెపాన్ తీర ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలోని ఆరో అంతస్తులు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4 గంటల 40 నిముషాలకు ఘటన జరగినట్లు స్థానికులు చెబుతున్నారు.
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జల్గావ్ జిల్లా భుసావల్ లోని ఓ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు నాలుగు అగ్ని మాపక బృందాలు ప్రయత్నించాయి.
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పుణేలోని వాడర్వాడీ ప్రాంతంలో 15 గుడిసెలకు నిప్పు అంటుకుంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 15 గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
Jangaon జిల్లాలోని ఓ టిన్నర్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.