కృష్ణా జిల్లా: మచిలీపట్నంలోని రాజుపేటలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ వ్యక్తి సజీవదనమయ్యాడు. మహిళ ప్రాణాలతో బయటపడింది. కాగా పేలుడు ధాటికి ఇల్లు కుప్ప కూలిపోయింది. ఇంట్లో సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు
స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం తెల్లవారుఝామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు సమయంలో ఆ ఇంట్లో తల్లి కొడుకులు ఉన్నారు. కుమారుడు మహ్మద్ బాజీ ఇంట్లో నిద్రిస్తుండగా తల్లి ఆరుబటయ నిద్రపోతుంది. ఈ క్రమంలో పేలుడు సంబంభించడంతో ఇంట్లో నిద్రిస్తున్న బాజీ సజీవదహనం కాగా..తల్లి ప్రాణాలతో బయటపడింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించినట్లు తేలిసింది.