ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారి ఉనికి, ఆవిర్భావంపై దర్యాప్తు జరిపేందుకు అమెరికా తన వైద్య నిపుణులను పంపించాలని ప్రయత్నం చేస్తున్నట్టు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. కోవిడ్ 19
కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగిస్తోన్న హైడ్రోక్లోరోకిన్ ఔషదాన్ని తమకు ఎగుమతి చేయాల్సిందిగా 25 దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు భారత్ ఓకే చెప్పింది. దేశంలో ఉన్న నిల్వల గురించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఎన్నో సమాలోచనలు చేసిన తర్వాతే భారత సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితిలో మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధం కోసం భారతదేశాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
కరోనా(COVID-19) మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్ అమెరికాతో కలిసి పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాము వివిధ అంశాలపై విస్తృతమైన టెలిఫోన్ సంభాషణలు జరుపుతున్నామని, COVID-19 తో పోరాడటానికి భారత-యుఎస్ భాగస్వామ్యం, ఆవశ్యకతపై చర్చించామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా చైనా, ఇటలీ తర్వాత కరోనా పాజిటివ్ బాధితులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికానే అని WHO అధికారిక వర్గాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో సుమారుగా 33,546 మంది కరోనా పాజిటివ్ బాధితులున్నారని, మృతుల సంఖ్య 419 చేరిందని,
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వ్యాపిస్తోంది. ధనిక, పేద, మధ్యతరగతి, ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు.. ఇలా ఎవరినీ వదలడం లేదు. రాజకీయ ప్రముఖులైనా, సినీ ప్రముఖులైనా ఎవరికీ తప్పని పరిస్థితి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు కరోనా వైరస్ అంటే గజగజలాడిపోతున్నారు.
19 ఏళ్లుగా ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడనుందా ? ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు వెనక్కి వెళ్లిపోనున్నాయా ? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు ? అసలు ఈ దోహా శాంతి ఒప్పందం ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడాల్సిందే.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత పర్యటనను మర్చిపోలేకపోతున్నారు. భారత పర్యటన తన జీవితంలో చెరగని ముద్ర వేసిందని చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే భారత్ లో పర్యటించడం చాలా సంతృప్తినిచ్చిందని చెబుతున్నారు.
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బస చేసేందుకు భారత ప్రభుత్వం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ఉన్న ఐటిసి మౌర్య హోటల్లో సూట్ ఏర్పాటు చేసింది. ది గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ లేదా చాణక్య సూట్ పేరుతో పిలుచుకునే ఈ సూట్ ప్రత్యేకతలు ఏంటి ? ఇప్పటివరకు ఎంత మంది అమెరికా అధ్యక్షులు ఈ సూట్లో బస చేశారు ? అమెరికా అధ్యక్షుడు బస కోసం ఏర్పాటు చేసిన ఈ సూట్ కోసం రోజుకు ఎంత ఖర్చు అవుద్ది ? ఐటిసి మౌర్య హోట్లలోని ఎన్నో అంతస్తులో ఈ సూట్ ఉందనే వివరాలు తెలియాలంటే ఈ డీటేల్ట్ స్టోరీ వీడియో చూడాల్సిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెలానియ, ఇవాంక ఎక్కడికెళ్తే.. అక్కడ వాళ్లను చూసేందుకు స్థానికులు ఆసక్తి ప్రదర్శించారు. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ జీవితంలోకి వచ్చిన మెలానియ ట్రంప్ ఎవరు ? ఎప్పుడు, ఎలా ట్రంప్ జీవితంలో ఆమె ఓ భాగమయ్యారు ? సవతి తల్లి అయిన మెలానియా ట్రంప్‌కి, కూతురు ఇవాంకా ట్రంప్‌కి మధ్య ఎలాంటి సంబంధం ఉంది ? ఇవాంక ట్రంప్ ప్రత్యేకతలు ఏంటి ? ఎందుకు ఇవాంకకు అంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ? నలుగురు పిల్లల తల్లి అయిన ఇవాంక గ్లామర్ సీక్రెట్ ఏంటనే అనేక సందేహాలకు సమాధానమే ఈ సింగిల్ వీడియో. ఇంకెందుకు ఆలస్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జేర్డ్ కుష్నర్ తాజ్ మహల్‌ను పర్యటించి ఆ చారిత్రక కట్టడం గురించి అడిగి తెలుసుకున్నారు. తాజ్ మహల్‌ను ఎవరు నిర్మించారు, తాజ్ మహల్ డిజైనర్ ఎవరు ? తాజ్ మహల్ నిర్మాణంలో ఎంత మంది పాల్గొన్నారు లాంటి ప్రశ్నలను అడగకుండా ఉండలేకపోయారు. తన పిల్లలను తీసుకువచ్చుంటే వాళ్లు కూడా తాజ్ మహల్ అందాలను చూసుండే వాళ్లని.. కానీ వాళ్లను తీసుకురాకపోవడం వల్ల వాళ్లు ఆ ఛాన్స్ మిస్ అయ్యారని ఇవాంక ట్రంప్ చెప్పినట్టుగా వారికి గైడ్‌గా వ్యవహరించిన వాళ్లు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తాజ్ మహల్ పర్యటన విశేషాలకు సంబంధించిన మరింత సమాచారం
అమెరికా అధ్యక్షుడు చేపట్టిన భారత పర్యటన పాకిస్తాన్‌ను షేక్ చేస్తుందా ? నమస్తే ట్రంప్ కార్యక్రమం వేదికపై నుంచి భారతీయులను అక్కున చేర్చుకునేలా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది. భారత్‌లో తమకు అందిన ఆతిథ్యం, తమపై చూపిన అనురాగం ఎప్పటికీ మరువలేనిదని.. ఇకపై భారతీయులను అమెరికా ఎప్పటికీ మర్చిపోదు అని డొనాల్డ్ ట్రంప్ చేసిన అటు ప్రసంగం అమెరికన్లను, ఇటు భారతీయులను ఆకట్టుకునేలా ఉండగా.. పాకిస్తాన్‌కు మాత్రం కచ్చితంగా మింగుడుపడే అవకాశమే లేదు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు మరింత బలపడేలా ట్రంప్ ఏమన్నారో ఈ వీడియోలో మీరే
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ ( మంగళవారం ) సాయంత్రం విందు ఇవ్వనున్నారు. ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది.
అదో అద్భుతమైన కట్టడం.. ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు మరో చిహ్నం. ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి. పాలరాతితో నిర్మించిన అద్భుతమైన కట్టడం.. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందుకు కారణం. . ఈ ప్రేమ కట్టడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి తిలకించడమే.
ఇవాంకా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గారాలపట్టి. అంతే కాదు ఫ్యాషన్ కు మారు పేరు. ఆమె వేసుకునే దుస్తులే ఫ్యాషన్ క్రియేట్ చేస్తాయి. నిన్న గుజరాత్ లో అడుగుపెట్టగానే .. ఆమె వేసుకున్న డ్రెస్ పై చర్చలు మొదలయ్యాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నమస్తే ట్రంప్ వేదికపై మైక్ అందుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కన ప్రసంగం ఆరంభంలోనే మోదీకి తనదైన స్టైల్లో కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీని ఛాంపియన్‌గా, అమెరికాకు, తనకు నిజమైన స్నేహితుడిగా అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్.. తనను భారత్‌కి ఆహ్వానించి ఘన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.