కరోనా వైరస్ ( corona virus ) మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా చికిత్స కోసం వివిధ రకాల మందుల్ని వివిధ సందర్భాల్లో వినియోగిస్తున్నారు. ఆయా సందర్బాల్లో వచ్చిన ఫలితాల్ని బట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World health organisation) అనుమతించడమో లేదా నిరాకరించడమో చేస్తూ వస్తోంది. నిన్నటి వరకూ కరోనా చికిత్సలో ప్రాధాన్యత వహించిన ఆ ప్రత్యేక మందుల్ని ఇకపై నిలిపివేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది
కోవిడ్ 19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోంది. అన్ని దేశాల్లోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతోపాటు చాలా దేశాల్లో వివిధ రకాల మందుల్ని ఈ వైరస్ పై ప్రయోగిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల ఫలితాలు ఎలా ఉన్నాయనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. మరో రెండు వారాల్లోనే ఔషధాల ప్రయోగ ఫలితాలు రానున్నట్టు డబ్యూహెచ్ వో స్పష్టం చేయడమే దీనికి కారణం.
ఇండియాలో కరోనావైరస్ విషయంలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని కేంద్రం స్పష్టంచేసింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే ఒకరి నుంచి మరొకరిని దూరంగా ఉండాల్సిందిగా చెబుతూ వస్తున్నట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదని లవ్ అగర్వాల్ పిలుపునిచ్చారు.
కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగిస్తోన్న హైడ్రోక్లోరోకిన్ ఔషదాన్ని తమకు ఎగుమతి చేయాల్సిందిగా 25 దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు భారత్ ఓకే చెప్పింది. దేశంలో ఉన్న నిల్వల గురించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఎన్నో సమాలోచనలు చేసిన తర్వాతే భారత సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితిలో మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధం కోసం భారతదేశాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.