Etela Rajender: త్వరలో బీజేపీలోకి భారీ చేరికలు ఉండబోతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. ఈనెల 21న మునుగోడు సభలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పారు. అదే సభలో దాసోజు శ్రవణ్ సహా పదుల సంఖ్యలో నేతలు తమ వైపు వస్తున్నారని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన మురళీ యాదవ్, రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావులు కాషాయ కండవా కప్పుకుంటారన్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం కేసీఆర్ ఇనుప కంచె వేశారని ఆరోపించారు. పోయే కాలం వచ్చి..హుజురాబాద్‌లో టీఆర్ఎస్ నేత చిల్లర వేషాలు చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రులు ఉన్నారని విమర్శించారు. బాసర విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని తెలిపారు.
హైదరాబాద్‌లో హోర్డింగ్స్‌ల కోసం పెట్టిన ఖర్చుతో బాసర విద్యార్థుల సమస్యలను పరిష్కారం అవుతాయన్నారు. సీఎం మనమడు చేసే భోజనమే గురుకుల పాఠశాల విద్యార్థులు చేస్తున్నారన్న కేటీఆర్ ..దీనికి ఇప్పుడు స్పందించాలన్నారు. గురుకులాల్లో సరిపడినంత సిబ్బంది, టీచర్స్ లేరని..విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి వీసీని నియమించాలని విద్యార్థులు కోరడం తప్పా అని ప్రశ్నించారు.
దేవుడితో సమానమైన పిల్లలను బాధ పెట్టడం సీఎం కేసీఆర్‌కు సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అద్దె భవనాల్లో నడుస్తోన్న గురుకుల పాఠశాలలకు కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం రంగంలోకి దిగి విద్యార్థుల సమస్యలను పరిష్కరించారు.
Also read:Cooking Oil: సామాన్యులకు అందుబాటులోకి వంట నూనెల ధరలు..త్వరలో మరో కీలక నిర్ణయం..!
Also read:India vs West Indies: రేపే భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్..తుది జట్లు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook