Dasoju Sravan: మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ గూటికి దాసోజు శ్రవణ్

Dasoju Sravan Join Trs: మునుగోడు ఉపఎన్నికకు ముందు బీజేపీకి షాకిచ్చేలా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు ఈ నేపథ్యంలోనే  అధికార టీఆర్ఎస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. గురువారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ కారెక్కగా.. తాజాగా దాసోజు శ్రవణ్ గులాబీ గూటికి చేరబోతున్నారు.

Last Updated : Oct 21, 2022, 01:12 PM IST
Dasoju Sravan: మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ గూటికి దాసోజు శ్రవణ్

Dasoju Sravan Join Trs: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికకు ముందు బీజేపీకి షాకిచ్చేలా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు ఈ నేపథ్యంలోనే  అధికార టీఆర్ఎస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. గురువారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ కారెక్కగా.. తాజాగా దాసోజు శ్రవణ్ గులాబీ గూటికి చేరబోతున్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న దాసోజు శ్రవణ్ .. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు ఆయన రాజీనామా లేఖ పంపారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన శ్రవణ్.. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

ఆగస్టు 7న కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు దాసోజు శ్రవణ్. అయితే రెండున్నర నెలల సమయంలోనే ఆయన కాషాయ పార్టీని వీడారు. తన లేఖలో బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేశారు దాసోజు శ్రవణ్. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారీ స్థాయిలో మద్యం, మాంసాన్ని ఓటర్లకు పంచిపెట్టడంతో పాటు విచ్చలవిడిగా డబ్బులు కుమ్మరిస్తున్నదనే ఆరోపణలు చేశారు.  దశ దిశ లేని పార్టీలో కొనసాగలేనని చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని బీజేపీ చెప్పే మాటలతో ఆ పార్టీలో చేరానన్నారు శ్రవణ్. అయితే ఆ పార్టీలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదన్నారు. మునుగోడులో బీజేపీ తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. బీజేపీ నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మక రాజకీయాలు లేకపోవడంతో తెలంగాణ సమాజానికి ఉపయోగకరంగా లేవని తాను గుర్తించానని తెలిపారు.

ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఎంట్రీ ఇచ్చారు దాసోజు శ్రవణ్. 2009లో సికింద్రాబాద్ నుంచి పీఆర్సీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే 2014లో తనకు టికెట్ రాకపోవడంతో కారు దిగిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లోనూ దాసోజుకు కీలక పదవులు వచ్చాయి. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శగా నియమించబడ్డారు. ఆ పదవిలో ఉండగానే కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. అయితే కొన్నిరోజులుగా బీజేపీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు.

Also read: Munugode Bypoll: ఓట్ల కోసం కోటి తిప్పలు.. యాదాద్రిలో మునుగోడు ఓటర్లకు స్పెషల్ దర్శనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News