Covaxin: కొవాగ్జిన్ ఎగుమతులు పునః ప్రారంభించిన భారత్ బయోటెక్​

Covaxin: ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతులను తిరిగి ప్రారంభించినట్లు భారత్​ బయోటెక్ సోమవారం ప్రకటించింది. ఒమిక్రాన్​ వేరియంట్ భయాలతో భారీగా ఎగుమతుల లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 09:41 PM IST
  • కొవాగ్జిన్ ఎగుమతులు షురూ
  • అధికారికంగా ప్రకటించిన భారత్ బయోటెక్​
  • టీకాల ఎగుమతులకు కేంద్రం ఇటీవలే అనుమతి
Covaxin: కొవాగ్జిన్ ఎగుమతులు పునః ప్రారంభించిన భారత్ బయోటెక్​

Bharat Biotech said on Monday it has resumed export of its COVID-19 shot: హైదరాబాద్​కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఇతర దేశాలకు వ్యాక్సిన్ డోసుల ఎగుమతిని (Bharat Biotech resumed export of Covaxin) పునః ప్రారంభించినట్లు తెలిపింది.

చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న ఆర్డర్లపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు భారత్ బయోటెక్​ వెల్లడించింది.

భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ కొవాగ్జిన్​ డోసులను ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునేందుకు కేంద్రం ఈ నెల 24న ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే నేడు ఎగుమతులను (Bharat Biotech on Vaccine export) పునరుద్ధరించింది.

భారీగా ఎగుమతుల లక్ష్యం..

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron variant) భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో 108 లక్షల కొవాగ్జిన్ డోసులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.

కొవాగ్జిన్ గురించి..

కరోనా వైరస్ నియంత్రణకు దేశీయంగా అభివృద్ధి చేసిందే కొవాగ్జిన్. కొన్ని నెలలుగా ఈ వ్యాక్సిన్​ను దేశీయంగా విరివిగా వినయోగిస్తుండగా.. తొలి దశలో పలు దేశాలకు ఎగుమతులు కూడా జరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) కూడా ఇటీవలే కొవాగ్జిన్​కు (WHO on Covaxin) గుర్తింపునిచ్చింది. 

అదే విధంగా ప్రముఖ మెడికల్ జర్నల్​ లాన్సెట్ (Lancet on Covaxin)​ కూడా కొవాగ్జిన్​ మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రచురించింది. టీకా సమర్థ్యం (Covaxin efficiency) 77.8 శాతంగా అందులో వెల్లడించింది. డెల్టా వేరియంట్​పై టీకా సామర్థ్యం 65.2 శాతంగా ఉంటుందని పేర్కొంది.

కేంద్రం పర్యవేక్షణలోనే ఎగుమతులు..

వ్యాక్సిన్ ఎగుమతుల ప్రారంభమైన నేపథ్యంలో.. వీటిపై కేంద్రం పర్యవేక్షణ కొనసాగనుంది. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. నెలకు ఎన్ని డోసులు ఎగుమతి చేయాలనే విషయాన్ని కేంద్రమే నిర్ణయించనుంది.

కొవాగ్జిన్​ను దిగుమతు చేసుకునే దేశాలు..

కొవాగ్జిన్​ను బోట్స్​వానా, పెరుగ్వే, వియత్నాం, మయన్మార్​, ఫిలిప్పీన్స్, సింగపూర్​, కమరూన్​, యూఏఊ సహా మొత్తం 18 దేశాలు దిగుమతి చేసుకోనున్నాయి. ఇందులో 13 దేశాలు ఒమిక్రాన్ వేరియంట్ భయాలు అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా సమీప దేశాలే కావడం గమనార్హం.

Also read: Rahul Gandhi: చర్చలంటే ప్రభుత్వం భయపడుతోంది: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Also read: Rajya Sabha MP Suspension: పార్లమెంట్ సమావేశాల తొలి రోజే 12 మంది ఎంపీలు సస్పెండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News