Tamilnadu CM Stalin: ఏపీ సీఎం జగన్‌కు స్టాలిన్ షాక్.. ఆనకట్టల నిర్మాణం ఆపాలని డిమాండ్

CM Stalin Letter: రాష్ట్రాల మధ్య జల వివాదాలు కామన్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. కృష్ణా రివర్ బోర్జుకు ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ తెరపైకి వచ్చింది.

Written by - Srisailam | Last Updated : Aug 14, 2022, 11:07 AM IST
  • ఏపీ, తమిళనాడు మధ్య వాటర్ వార్
  • ఏపీ సీఎం జగన్ కు స్టాలిన్ లేఖ
  • కొనస్తల నదిపై రిజర్వాయర్లు ఆపాలని లేఖ
Tamilnadu CM Stalin: ఏపీ సీఎం జగన్‌కు స్టాలిన్ షాక్.. ఆనకట్టల నిర్మాణం ఆపాలని డిమాండ్

CM Stalin Letter: రాష్ట్రాల మధ్య జల వివాదాలు కామన్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. కృష్ణా రివర్ బోర్జుకు ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ తెరపైకి వచ్చింది. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఆనకట్టల నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఆయన లేఖ రాశారు. ముక్కల కలందిగయ్, కథరాపల్లి ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కొనస్తల నదిపై చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణంపై స్ఠాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొసస్తల నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఖండించారు. రెండు రాష్ట్రాల మధ్య పారుతున్న నదిపై.. తమతో చర్చించకుండా ఏపీ ప్రభుత్వం నిర్మాణం ఎలా చేపడుతుందని స్టాలిన్ ప్రశ్నించారు.తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా సరిహద్దులో ఎలాంటి కట్టడాలు చేపట్టవద్దని సీఎం జనగ్ కు రాసిన లేఖలో స్టాలిన్ కోరారు. ముక్కల కలందిగయ్, కథరాపల్లి ఆనకట్టలతో.. చెన్నై నగరానికి తాగునీటిని అందించేందుకు నిర్మిస్తున్న పూండీ రిజర్వాయర్‌కు నీరు రాకుండా పోతుందని లేఖలో తెలిపారు.రిజర్వాయర్ల నిర్మాణం వెంటనే ఆపే విధంగా యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టవద్దని ఏపీ సీఎంకు రాసిన లేఖలో సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

చిత్తూరు జిల్లాలోని కతరపల్లి, ముక్కలకండిగై గ్రామాల్లో కుశస్థలి నదిపై రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తమిళనాడు సరిహద్దులో నగరి దగ్గర కుశస్థలి నదికి వరదలొస్తే నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. ఈ నీటిని ఒడిసిపట్టేందుకు గొలుసుకట్టు విధానంలో 20 చెరువులకు మళ్లించేలా ప్రాజెక్టుల్ని చేపట్టింది ఏపీ ప్రభుత్వం. కుశస్థలి నది నుంచి నీటిని దారి మళ్లించి చెరువులకు సరఫరా చేసేందుకు ఏపీ సర్కార్‌ ప్రయత్నించగా.. 2017లో వచ్చిన వరదల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు. అప్పటి నుంచి పనులు చేపట్టలేదు. విస్తారంగా వర్షాలు కురిసినా  కుశస్థలి నది నుంచి నీరు మాత్రం చెరువులకు చేరకుండా వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. దీంతో నగరి ప్రాంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో తాజాగా రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

Read also:Rakesh Jhunjhunwala: రాకేశ్ ఝుంఝన్‌వాలా జన్మస్థలం హైదరాబాదే.. ఆయన మొత్తం ఆస్తి ఎంతో తెలుసా?

Read also: TRS MLA COMMENTS:కేసీఆర్ పిలుపు మేరకు దేశానికి స్వాతంత్ర్యం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విడ్డూరం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News