Citizenship Amendment Act Full Details: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2019లో తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చేశాయి. నాలుగేళ్లు క్రితమే ఈ బిల్లు చట్టంగా మారినా.. తీవ్ర వివాదస్పదం కావడంతో ఇన్నాళ్లు అమలు చేయలేదు. సీఏఏను పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మాణాలు చేశాయి.
Also Read: CAA Implement: మోదీ ప్రభుత్వం సంచలనం.. ఎన్నికల వేళ సీఏఏ అమలుకు నిర్ణయం
సీఏఏ చట్టానికి సంబంధించి కీ పాయింట్స్..
==> బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చిన హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం అందించడానికి ఈ చట్టం రూపొందించారు.
==> గత 14 సంవత్సరాలలో కనీసం ఐదు సంవత్సరాలలో భారతదేశంలో నివసించిన వలసదారులకు భారతీయ పౌరసత్వం మంజూరు లభిస్తుంది. ఇంతకుముందు వలసదారులకు పౌరసత్వం లభించాలంటే 11 సంవత్సరాలు నివసించాలని నిబంధనలు ఉండేవి.
==> రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చిన అస్సాంలోని కర్బీ ఆంగ్లోంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరంలోని చక్మా జిల్లా, త్రిపురలోని గిరిజన ప్రాంతాల జిల్లాలతో సహా అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఉంటుంది.
==> డిసెంబర్ 2019లో సీఏఏను పార్లమెంట్ ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈశాన్య ప్రాంతంతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా నిరసనలు వ్యక్తం అయ్యాయి.
==> లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ నిబంధనలను నోటిఫై చేసి అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ప్రకటించారు.
==> భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వారందరికీ చట్టం ప్రకారం దరఖాస్తులను సమర్పించే ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.
==> సీఏఏ చట్లం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి మన దేశానికి వచ్చిన ముస్లిమేతర పౌరులు హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించేందుకు రూపొందించారు. ముస్లింలకు మాత్రం భారత పౌరసత్వం అందించకపోవడంతో వివాదం మొదలై తీవ్ర విమర్శలకు దారి తీసింది.
==> ఈ చట్టం అమలుతో మన దేశంలోని ముస్లింల పౌరసత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇతర మతాలు, వర్గానికి చెందిన వారికి కూడా ఎలాంటి ముప్పు ఉండదు.
==> పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లింయేతరులకు మాత్రమే భారత పౌరసత్వం అందించనున్నారు. ఆ మూడు దేశాల్లో మతం పేరుతో హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలు అణచివేతకు గురవుతున్నారని.. వలసదారులకు మన దేశానికి వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఆ దేశాల్లో ముస్లింలు మతం పేరుతో అణచివేతకు గురవ్వరని.. అందుకే వారిని చేర్చలేదని పేర్కొంటోంది. ఈ నిబంధన వివక్షకు కారణమవుతోందని వివాదం జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter