CAA Rules: మరో పదిహేను రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈలోగా వివాదాస్పద సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్‌ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. సీఏఏ అమలుకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాలను నోటిఫై చేయనుంది.
దేశవ్యాప్తంగా భారీ నిరసనల మధ్య 2019లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందింది. కొన్ని రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. సీఏఏపై ఇతర దేశాల్నించి సైతం అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చట్టరూపం దాల్చినా అమలు ప్రక్రియను ఆలస్యం చేసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున తక్షణం సీఏఏ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమౌతోంది. అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే సీఏఏ నిబంధనలు, మార్గదర్శకాల్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయనుంది.
సీఏఏ చట్టం అంటే ఏమిటి
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారతదేశ పౌరసత్వం కల్పించడమే సీఏఏ ముఖ్య ఉద్దేశ్యం. 2014 డిసెంబర్ 31కు ముందు ఇండియాకు వలస వచ్చివారు ఇందుకు అర్హులు. ఈ అర్హత కేవలం హిందూవులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్శీలు, బౌద్ధులకు మాత్రమే వర్తిస్తుంది. ముస్లింలకు వర్తించదు. వీరంతా ఎలాంటి ధృవీకరణ పత్రాల్లేకున్నా పౌరసత్వం కోసం దాఖలు చేసుకోవచ్చు. ఈ చట్టం పరిధిలో ముస్లింలను చేర్చకుండా ముస్లిమేతరులు అని ప్రస్తావించడమే వివాదానికి కారణమైంది. కేవలం మతం ప్రాతిపదికగా చట్టం రావడం ఇదే తొలిసారి.
ఇప్పుడు సీఏఏ నిబంధనలు నోటిఫై అయితే..పౌరససత్వం కోసం దరఖాస్తు చేసుకున్న ముస్లిమేతర మతస్థులు తమ అర్హత నిరూపించుకునేందుకు ఎలాంటి రుజువులు సమర్పించాల్సి వస్తుందనేది వివరాలు ఉంటాయి. ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపిస్తుందని, రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు విరుద్ధమనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం లోక్‌సభ ఎన్నికలకు ముందే నోటిఫై చేస్తామని స్పష్టం చేశారు. వాస్తవానికి సీఏఏ అనేది గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ అని ఆయన గుర్తు చేశారు. ఆ పార్టీ చేయనిదానిని తాము అమలు చేస్తున్నామన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook