Citizenship Amendment Act:మధ్యప్రదేశ్‌లో సీఏఏ అమలు, ఆరుగురు పాక్ శరణార్ధులకు ఇండియా పౌరసత్వం

Citizenship Amendment Act: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం అమల్లో వచ్చింది. ఆరుగురు పాకిస్తాన్ శరణార్ధులకు పౌరసత్వం లభించింది. చాలాకాలంగా ఇండియాలో జీవిస్తున్న ఆరుగురికి దేశ పౌరసత్వం కల్పించినట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 7, 2021, 08:23 PM IST
Citizenship Amendment Act:మధ్యప్రదేశ్‌లో సీఏఏ అమలు, ఆరుగురు పాక్ శరణార్ధులకు ఇండియా పౌరసత్వం

Citizenship Amendment Act: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం అమల్లో వచ్చింది. ఆరుగురు పాకిస్తాన్ శరణార్ధులకు పౌరసత్వం లభించింది. చాలాకాలంగా ఇండియాలో జీవిస్తున్న ఆరుగురికి దేశ పౌరసత్వం కల్పించినట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

పౌరసత్వ సవరణ చట్టం అంటే సీఏఏ(CAA). దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి మధ్యప్రదేశ్‌కు వచ్చిన ఆరుగురు శరణార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం భారత దేశ పౌరసత్వాన్ని అందించింది. మధ్యప్రదేశ్‌లో దశాబ్దాల నుంచి జీవిస్తున్నారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మతపరమైన హింసకు గురై..ఇండియాలో బతికేందుకు వచ్చారని..మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. భారత పౌరసత్వ(Indian Citizenship) పత్రాల్ని అధికారికంగా ఈ ఆరుగురికీ అందించారు. 

పౌరసత్వం పొందిన ఆరుగురిలో నందలాల్, అమిత్ కుమార్‌లు భోపాల్‌లో నివసిస్తుండగా..అర్జునదాస్, జైరామ్ దాస్, నారాయణ్ దాస్, సౌశల్యబాయిలు మాండ్‌సోర్‌కు చెందినవారుగా ఉన్నారు. 31 ఏళ్లుగా వీరు అటు పాకిస్తాన్, ఇటు ఇండియాకు రెండింటికీ చెందకుండా ఉన్నారు. ఇప్పుడు పౌరసత్వం రావడంతో భారతీయులమనే గర్వం ఉందని అంటున్నారు. 1998-2005 సమయంలో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ నుంచి ఈ ఆరుగురు ఇండియాకు వలస వచ్చారు. 2019లో కేంద్ర ప్రభుత్వం (Central government)ప్రవేశపెట్టిన సీఏఏ ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింసకు గురయ్యే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవ వలసదారులకు ఇండియా పౌరసత్వం కల్పించనుంది. అయితే 2014కు ముందు ఇండియాకు వలసవచ్చి ఉండాలి. 

Also read: Karnataka: కావేరి నదిపై ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News