శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకొచ్చిన అంబులెన్స్ వాహనం పోలీస్ ఎస్కార్ట్ సెక్యురిటీగా వున్న వాహనాల మధ్య రాత్రి సరిగ్గా 10:33 గంటలకు గ్రీన్ ఎకరాస్ బిల్డింగ్ ఆవరణలోకి ప్రవేశించింది.
దుబాయ్‌లోని జుమేరియా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో ఫిబ్రవరి 24న అర్ధరాత్రి శ్రీదేవి మృతిచెందగా, ఆ తర్వాత నాలుగు రోజులకు మంగళవారం రాత్రి ఆమె భౌతికకాయం ప్రత్యేక ప్రైవేట్ జెట్ విమానంలో ముంబైకి చేరుకుంది.
దక్షిణాదిన సినీ పరిశ్రమకు పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్లో మకుటం లేని మహరాణిలా దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు రెండు తరాలకు చెందిన అగ్రహీరోలతో సినిమాలు చేసిన శ్రీదేవికి దేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలలా అభిమానులు వున్నారు. అందుకే ఆమె అకాల మృతిని ఆ అభిమాన ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. శ్రీదేవి సన్నిహితమిత్రులు, పరిశ్రమ ప్రముఖులు ఆమెతో తమకు వున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని, శ్రీదేవి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిది అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శ్రీదేవిని చివరిసారిగా కలిసిన సందర్భాలు గుర్తుచేసుకుంటున్న ఇంకొంతమంది..
శ్రీదేవి అకాల మరణం వెనుక కారణం ఏంటి ? దుబాయ్ నుంచి వెలువడుతున్న వార్తల్లో ఎంతమేరకు నిజం వుంది ? ఆమె నిజంగానే ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి చనిపోయిందా ? లేక ఎవరైనా దురుద్దేశపూర్వకంగా కుట్రపన్నారా ?
బాహుబలి సినిమాతో టాలీవుడ్లోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఒక్క అతిలోక సుందరి శ్రీదేవి వద్ద మాత్రం తీరని విభేదాలను సొంతం చేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.